పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

చాటుపద్యరత్నాకరము

   పంకజభవ పంకజభవ
   పంకజభవ పంకజారి పంకేజంబై.

క. సరసిజశశి శిశిరశర
   చ్ఛరదశరము లోడెఁ దద్యశమునకు ధైర్య
   స్ఫురణకు నవియే యోడెను
   హరనుత మగుతేజమునకు నవియే యోడెన్.

కచ్చి రంగయ్య


క. నలు గురు నినుఁ బలు మారున్
   గెలిచితి సుగుణోక్తికాంతి కీర్త్యాకృతులన్
   నలుగురు నినుఁ బలుమాఱున్
   భళి! భళి! యనఁ గచ్చిరంగ! భాగ్యతరంగా!

బారు వెంకన


క. వర బారు వేంకనార్యుని
   ధర నిండినకీర్తి వెలసె ధరజిత్పురజి
   ద్ధరధరజిత్పురత్పురజి
   ద్ధరజిత్పురజిత్తురంగ ధావళ్యంబై.

మల్రాజువారు

వీరు నరసారావుపేట సంస్థానాధీశ్వరులు. మహాశూరులు. వెలమదొరలు. దాతలు. పండితులయందును గవులయందును నాదరము గలవారు దిట్టకవి నారాయణకవికృతమగు రంగా