పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

చాటుపద్యరత్నాకరము

కోటసింగరాజు

“సీ. పట్టిసపుర వీరభద్రుని ప్రేమచేఁ
   జెన్నొందె శ్రీకోటసింగరాజు...”

అని ముప్పదియిద్దఱుమంత్రులను దెల్పు సీసమాలికలోఁ బేర్కొనఁబడిన సింగరా జీతఁడే. ఈతనిఁ గుఱించిన చాటువులు

క. నరజన్మంబునఁ బుట్టినఁ
   గరణీకమె యుత్తమంబు కరణంబైనం
   బురుషార్థపరుఁడు గావలె
   శిర సెత్తినఫలము కోటసింగమవర్యా!

చ. గడుసరిలోభియర్థ మది కన్నపుదొంగలబందిపోట్లకున్
   బుడమిని వారకాంతలకు భూపతికిం జను కోటసింగ! నీ
   పడసినయర్థ మార్తులకు బాంధవకోటికి యాచకాళికిన్
   గుడులకు సత్త్రశాలలకుఁ గూపతటాకవనప్రతిష్ఠకున్.

సాహిణిమారుఁడు

“సీ. కొనియె భాస్కరునిచేఁ దెనుఁగురామాయణం
   బారూఢి సాహిణి మారమంత్రి....”

అను ద్వాత్రింశన్మంత్రిసీసమాలికాచరణ మీతని నియోగిఁగా నియోగించినది; కాని యీతఁడు బ్రాహ్మణుఁడు