పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

చాటుపద్యరత్నాకరము

షాదిక్షాంతకందములు

క. షాక్షరమాదిగఁ జెప్పెద
   నీక్షణమునఁ గందపద్యనివహము వరుసన్
   వీక్షింపర దయతో నిటు
   రాక్షసహర! రామ! మోక్షరామాధ్యక్షా!

క. షడ్రాజన్యాంబరయుత
   రాడ్రతవర్గస్తుతామరస్సరసీజా
   తేడ్రుడ్యాగారపరి
   వ్రాడ్రీవర! రామ! మోక్షరామాధ్యక్షా!

క. షణ్మిధనాంభస్సంభవ
   రాణ్మానితనూత్నరత్నరాజన్ముకుటో
   ద్యన్మండితాంతరీక్ష వి
   రాణ్మూర్తీ! రామ! మోక్షరామాధ్యక్షా!

క. షట్పదలసితోద్యస్మిన్
   త్రిట్పదలాంగప్రకాశధీరాజితగ్రా
   జట్పదజటిపటనానా
   రాట్పూజిత! రామ! మోక్షరామాధ్యక్షా!

రాజు వెంకనకవికిఁ గల పాండిత్యమును, ఆశుధారాపాటవమును, సమయస్ఫూర్తి చాతుర్యమును గ్రహించి నూటపదార్లు బహుమాన మొసంగి, విలువగల వలువలు కట్టఁబెట్టెను. ఆసభలోనున్న పండితు లంతఱును వేంకనకవి ‘కభినవాంధ్రకవితాపితామహ’యను బిరుద మొసంగి పద్యంబుల