పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

(మొ ద టి కూ ర్పు)


ఆంధ్రభాషాభిమాని సోదరులారా!

వాగనుశాసన కవిసార్వభౌమాంధ్రకవితాపితామహాదిమహామహులచే నెత్తిపెంపఁబడి, రాజాధిరాజులచే లాలింపబడి, దేశభాషాలతాంగులకు దలమానికమై చెన్నారిన మన యాంధ్రభాషాధూటి, తన ముద్దులొలుకుపలుకులను కేవల పురాణకావ్యప్రబంధరూపములనే కాక చాటుపద్యరూపమున గూడ వెలయించి వెలలేని పొగడ్త నందియున్నది. ఆచాటుఫణితి యొక్కొక్కపట్టునఁ బ్రబంధసరణిం గూడ నధఃకరించుననుట కవితాతత్త్వజ్ఞులకు విదితము.

చాటువులు కేవల కల్పనాకథాత్మకములును—అత్యంత్యాశయోక్తిమయములును—గాక విషయానుకూల స్వాభావికవర్ణనాలంకృతము లయి, సర్వజనహృదయంగమము లయి రస మొలుకుచుండును. అంతేకాక పూర్వరాజుల గుణగణములను, అప్పటి దేశస్ధితులను, నాఁటి యుద్దములను; జయాప