పుట:Chanpuramayanam018866mbp.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



శర్వాదు ల్నుతియింపలేనితఱి నీసౌందర్య మెంతోగదా
కార్వేటీశ ప్రసన్నవేంకటరమాకాంతామనోవల్లభా.


శా.

ఆర్వేలేండ్లు తపంబు చేసి భవదీయావాసశేషాద్రిపైఁ
జెర్వంగాంచెను వేల్పుమూఁకకు మహాసేనుండు బల్నెత్తురుల్
నుర్వు ల్గట్టఁగఁ దారకాసురుని దా నుగ్గాడె నీశక్తిచేఁ
గార్వేటీశ ప్రసన్నవేంకటరమాకాంతామనోవల్లభా.


శా.

తార్వాళంబులు వంచి చిత్తరుల వింత లముచ్చటైయుండఁగాఁ
దిర్వీథుల్ భవదీయసన్నిధిని ముస్తీదైన యావీథిలోఁ
దెర్వారే తిరునాళ్ల నీకు నడవన్ దృశ్యంబు గాకుండఁగాఁ
గార్వేటీశ ప్రసన్నవేంకటరమాకాంతామనోవల్లభా.


శా.

కుర్వేరుం దమనంబు జాతిసుమముల్ గోరంట చేమంతులున్
హర్వై నిగ్గులు దేఱు శ్రీతులసి నీ కర్పించు మర్త్యుండు దా
నేర్వజ్రంబుల మౌక్తికంబులను బూజించేఫలం బొందుఁగా
కార్వేటీశ ప్రసన్నవేంకటరమాకాంతామనోవల్లభా.


శా.

ఓర్వ న్శక్యమె యామ్యబాధ కటువై యుండ న్మనుష్యుం డిలం
జార్వాకోక్తులచేతనే చెడు దురాచారంబు గావించుఁగా
శర్వర్యందు నహస్సునందును భవచ్చారిత్రదూరాత్ముడై
కార్వేటీశ ప్రసన్నవేంకటరమాకాంతామనోవల్లభా.

జయంతి రామయ్య

కవిత్వవిమర్శనము

శ్రీమద్రామాయణమును జంపువుగా సంస్కృతభాషయందు రచించినకవి భోజరాజు. ఈ రాజకవి ధారానగరము రాజధానిగాఁ గల మాలవదేశమున క్రీ. శ. 1018 సం. మొదలుకొని 1060 వఱకు రాజ్యము చేసినట్లు శాసనములవలనఁ దెలియుచున్నది. కనుక నితఁడు క్రీ. శ. 1022 సం. మొదలు 1063 సం. వఱకు వేంగీదేశమును పాలించిన మనరాజరాజనరేంద్రునకు సమకాలికుఁడుగా నున్నాఁడు. ఇతఁడు సరస్వతీకంఠాభరణము, పాతంజలసూత్రవృత్తి మొదలగు గ్రంథములను రచించియుఁ బెక్కుపండితకవులకు నాశ్రయభూతుఁడై వారిచే బహుగ్రంథముల రచింపించియు సంస్కృతభాషను మహోన్నతికి దెచ్చెను.