పుట:Chanpuramayanam018866mbp.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

75


చ. వననిధిమేఖలావలయవారిజనీరజనీభవన్నరా
దనభటతండఖండనవితండకతండనురక్తుడై ఘనా
ఘనవలయంబుఁ దూఱెడు వికర్తను కైవడిఁ జొచ్చె దండకా
వనిఁ జమరీకిరీభహరివాహరిపూత్కరగండకావనిన్.

117


ఉ.

చంద్రధరప్రభావ శతచంద్రధరోపమరూప శ్రీహరి
శ్చంద్రమహామహీంద్రనిభసత్యవచోరచనాధురంధరా
చంద్రమతీసమానగుణసౌరభ వచ్చినకృష్ణమాజిమా
చంద్రముఖీమనోరమణ సాదరణశ్రుతబాణభాషణా.

118


క.

కిన్నరనిధినాయకనిభ, కిన్నరకంఠీనవీనకేళిన్యధిపా
పన్నాళాగరధరణీ, భృన్నుతకీర్తిప్రతాప మృదుసల్లాపా.

119


కవిరాజవిరాజితము.

భరతభగీరథనైషధవాహుషపఙ్క్తిరథాత్మజరంతియుధి
స్థిరయువనాశ్వతనూభవ భార్గవ చిత్రపవిత్రచరిత్ర నిధీ
వరకవిరాజవిరాజితమందిరవందిరసాలవసంతనిరం
తరనిరవద్యయశోణితశారదనారదపారదహారధరా.

120


గద్యము.

ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాద సమాసాదిత సరసకవితావిలాస వాసిష్ఠవంశకీర్తిప్రతిష్టాసంపాదక ఋగ్వేదికవి తిర్వేంగళార్యకలశరత్నాకరసుధాకర జగద్విఖ్యాత కవిరాజుకంఠీరవబిరుదాంక వేంకటాచలపతిప్రణీతం బైన చంపూరామాయణం బను మహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము.