పుట:Chanpuramayanam018866mbp.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

69


ల్పుటకుం జాలకయున్న కుంతలభరంబు న్నీతనూజుడు చెం
చటవిం దెచ్చిన మఱ్ఱిపాలఁ దడిపెన్ సాక్షీకృతోర్వీజుఁ డై.

75


చ.

ఘనతతిఁ దోచుకొమ్మెఱుఁగుకైవడిఁ గాఱడవిం జరించు న
జ్జనకజుకాళ్లగోళ్ల నొకచక్కఁదనం బిడురక్తిమంబు మె
త్తనిజిగి లత్తుకయ్యె మఱి తార్కొనఁబోదు వివర్ణభావ మా
ననమున కింత యైన రఘునాథసనాథవిహారహారితన్.

76


మ.

వనమార్గంబున రాత్రులుం గిసలయవ్రాతంబుచే రామభ
ద్రునకుం దల్ప మమర్చి దుష్టమృగసందోహంబు రాకుండ బల్
ధను వమ్ము ల్గొని కాచి యుండుట సుమిత్రాపుత్త్రుఁ డస్వప్నభా
వనకుం జొప్పడె రామసేవకుల కస్వప్నత్వ మాశ్చర్యమే!

77


క.

అని సుతులయునికిఁ దన కా, యన దెలుప నృపాలుఁ డప్పు డపరాద్రికిఁ బ్రా
మిను కున్మేనగుమినుకుం, జనఁ గౌసల్యన్ సశోకశల్యం బలికెన్.

78


క.

మగువా నీకిఁక వగవం, దగవా విను మిందుకు న్విధానము మున్నే
నగయాపితఘర్మవని, న్మృగయారతిఁ దమసకెలన మెలఁగుచు నచటన్.

79


చ.

యతిసుతుఁ డొక్కనాఁటినిశి నంబువు ముంచురొద న్మ ధేభమ
న్మతిశితశబ్దవేదిఁ దునుమ న్నను వృద్ధులు నంధు లైన త
ల్పితరులు వానితోనె చితి పేర్చి శిఖిం బడువారు మాగతిన్
మృతియెడఁ బుత్త్రశోకమె భరించు మటంచు శపించి రంగనా.

80


క.

కలిగితినిల శూద్రావై,శ్యులవలనఁ దపస్వి నగుచు నోనృపపర సం
ధిలు బ్రహ్మహత్య యనువెత, వల దని యాదుర్గతుండు స్వర్గతుఁ డయ్యెన్.

81


దశరథుని మరణము

క.

వశమా యటుగావున దు,ర్దశమాన్పఁగ రాదు రామరామా యనుచో
దశమావస్థకుఁ దార్చెం, బ్రశమాధికు శాప మపుడు పఙ్క్తిరథేశున్.

82


సీ.

అమరావతీపురం బాఁగుకోఁజూచెనా యేనిశాచరకులాధీశుఁ డైనఁ
చెఱువోయెనా యేమి జేజేనగరి [1]సూళగేరిలోపలి దేమిటారి యైన
రాయబారము వచ్చెనా యిత్తఱి నయోధ్య కింద్రుహేజీబులం దెవ్వఁడైన
నాజ్ఞప్తుఁ డాయెనా యఖిలావనీపరిత్రాణచాతురికిఁ బ్రధాని యైన

  1. “సూళగేరి” యనుపదము ద్వితీయాశ్వాసము 25 పద్యములో ఒకసారి వచ్చినది. సూళిగేరి(రు) = నాగవాసము (అని తోఁచుచున్నది.)