పుట:Chanpuramayanam018866mbp.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

చంపూరామాయణము


జననీహత్యకుఁ బ్రాయ మిచ్చుజరకుం దో రొప్పియున్ సాధువ
ర్తనులైనా రటుగానఁ గాన కిపు డేఁ దాతాజ్ఞఁ బోకుందునే.

45


గీ.

అనియుఁ దమ్ముఁడు వెంటరా జననితోడఁ, గైకయీవాక్యనిశమనగ్లపితనృపతి
వపురవనభవ్యకర్తవ్య మపుడు దెలిపి, తత్కృతాశీర్వచోరక్షఁ దాల్చి యంత.

46


చ.

జనశుభవాదమోదభరసంగత సీతవసించుమేడకుం
జనీ ఘనగర్జనంబు విని శాఖినటించు మయూరికిన్ ధను
ర్ధ్వని చెవిఁ దార్చు నాటవికువైఖరిఁ గాననవాసవార్తఁ దె
ల్పిన వెనుకోఁదలంచు నలప్రేయసిమాటకు నిహ్వలాత్ముఁడై.

47


క.

ఆననము [1]దగనులివమే, రాన నముచిదమనురమణి కధికవు నీవా
కాననము మృగాస్రోగ్రవృ, కాననము భజించుదాన నంభోజాక్షీ.

48


గీ.

అనెడు విభువారణోక్తుల వెనుకదీయ,
దయ్యె మహికన్య సింహమధ్యాగ్రగణ్య
వనికిఁ దాదృక్ప్రయత్నుఁ డయ్యెను సుమిత్ర
యనుఁగుఁబట్టియు హరిశౌర్యుఁ డగుట వంత.

49


చ.

ధనదంతావళధోరణీమణిగవాద్యం బైన యీవి న్సుయ
జ్ఞు నగస్త్యాహ్వయుఁ గౌశికుం ద్రిజటు రక్షోజైత్రయాత్రాచితం
దనిపె న్రాముఁడు మేదినీసుతయుఁ దద్వాసిష్ఠునిల్లాలికి
చ్చె ననేకాంబరభూషణంబులు వనీశ్రేయఃప్రయాణార్హతన్.

50


సీ.

దండకావిపినవాస్తవ్య మౌనివితానసంకటం బెడలించు కంకటంబు
శౌర్పణఖోరునాసన్ మౌక్తికతుషారకణఖరజ్యోతి గాడగలుగు హేతి
యచిర భావ్యబ్ధిమధ్యపురానిలింపసంపద్వ్యయం బైనచాపద్వయంబు
వలభిదాదిమతపఃఫలకాండకలనాతిశయకల్పనగ మైనశరధియుగముఁ


గీ.

దెచ్చుట కనుజ్ఞ వడసి యాత్మీయవిత్త, రాశి కోసలజాశ్రితాగ్రజున కొసఁగి
వెంట సౌమిత్రిరా రామవిభుఁడు నగరు, వెడలి సతి దానుఁ బురవీథి నడుచునపుడు.

51


మ.

అజరాదు ల్పొడగాంచఁగూడని యసూర్యంపశ్య నారాము దే
వి జనానీకవిలోకభాజనము గావింపన్ మదిం గొంకి పం
కజగర్భుండు ఘటించె నాగరకలోకశ్రేణికిం జూడ్కి బా
ష్పజలాకీర్ణముగా నజాహ్వయభృతక్షాత్రాభిమానోన్నతిన్.

52
  1. దగునువిదమేనాన - అని యుండవచ్చును.