పుట:Chanpuramayanam018866mbp.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
60
చంపూరామాయణము


గీ.

రాము వినయాభిరాము సుత్రామసదృశ, ధాము రావించి యోవత్స తావకీన
మౌళిమకుటంబు ఘటియింపమామనసు య,తిష్యమాణంబు రేపటితిష్యమందు.

15


చ.

అని నియమించి పంచినయజాత్మజుయత్నము కోసలేంద్రనం
దన కెఱిఁగించి యాత్మసదంబునకుం జనుదెంచి యున్న య
జ్జనకసుతాసహాయు కరసారసమున్ భృతికౌతుకంబుగా
నొనరిచెఁ దత్పురీజనులయుల్లమురీతి వసిష్ఠుఁ డంతటన్.

16


మ.

రఘురామోదయవార్తఁ దోచు జనహర్షశ్రీలకున్ గేహగే
హఘనానద్ధముఖానవద్యబహువాద్యశ్రేణు లాశాంతరా
లఘుదంతావళకర్ణతాళపరిఖేలం గాంచు నా దావహి
ల్ల ఘటించెన్ భువనత్రయీమకుటిపై లాగెత్తునౌద్ధత్యమున్.

17


కైక రెండు వరము లడుగుట

చ.

హరిహయకంటకాన్వయలయావహవైఖరి కెల్ల యైన క
ల్లరి మదిరీతి మేను కుటిలమ్ముగఁ ద్రిమ్మరు మాయదారి మం
దర యనుజంత శాంతభరితం బగుకైకమనంబు దివ్యపు
ష్కరిణివిశుద్ధవారి వనకాసరి వోలెఁ గలంచె నత్తఱిన్.

18


మ.

పటుఝంఝానిలపేషదోష ముదయింపన్ శీతలాంభోధర
చ్ఛటదంభోళి జనించినట్లు జనతాసౌఖ్యాపహృన్మందరా
కటువాక్యార్భటి నుద్భవించె భరతుం గన్నట్టి కైకేయి యం
తటిసీమంతవతీశిఖామణిమతిన్ దౌర్జన్య మత్యున్నతిన్.

19


శా.

ఆశాతోదరి మందరారమణి దయ్యంబో యనం జిత్తమా
వేశింప మును వైజయంతనగరోర్విన్ శంబరానీతబా
ధాశాంతిం బతివంకఁ గాంచినవరద్వంద్వంబు నావేళ యం
దాశించెన్ భరతాభిషేకరఘువర్యారణ్యచర్యాకృతిన్.

20


ఉ.

కైకయి వేఁడుతద్వరయుగంబు నిశాతశరాకృతిం జెవుల్
సోఁకి తపింపఁ జేయ మదిలో నిలఁజాలక దావపావకా
లోకము చుట్టుకొన్న వనిలోపల నుండి బహిర్వీనిర్గమ
స్వీకృతి గాంచు నేణిగతిఁ జేతన వోఁ దలిమోపరిస్థలిన్.

21


గీ.

వ్రాలి త్రెప్పిఱి నరపాలమౌళి దా న, సత్యభయశీలి గావున జాలిగొలుపు
నాలి నీలితనాన కౌననఁగఁజాలి, సోలి సుతుమాలిమికి నాగయాలిఁ జూచి.

22