పుట:Chanpuramayanam018866mbp.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
59
చతుర్థాశ్వాసము


వైరివీరముఖేందు వైవర్ణ్యరచనానిదానోగ్రసేనకు లోనుగాక
యాచకశ్రేణిదైన్యంబు నెల్వెలఁబాటు హరియించు ధనముచే హానిలేక


గీ.

తేఁటిలేబోఁటిగమికిఁ బూఁదేనెసోన, విందు సవరించువికచారవిందవాటి
నిండుపున్నమనాఁటివెన్నెల యనంగ, నెరసె జర మేన సిరసును నరసె మాకు.

7


ఉ.

కాన భవన్మతం బగునొకానొకపల్కు వచింతుఁ బార్థివో
ద్యానవినాశకృత్పరశుధారు జయించినవీరు సజ్జనా
ధీనవిహారు మేరుగిరిధీరు మదగ్రకుమారు నే నిఁకన్
భానుకులాధిరాజ్యమునఁ బట్టముగట్టి వహింతు నూఱటన్.

8


మ.

అనుసీతాదయితాభిషేచనకరవ్యాహార మారాజసిం
హునివంకన్ విని నాగరోత్కరము వర్ణోద్యోగజాగ్రద్ఘనా
ఘనఘోషశ్రవణక్షణాకలితకేకానిక్వణోత్సేకకే
కినికాయంబుగతిం బ్రమోదనినదాకీర్ణాఖిలాశాంత మై.

9


క.

ననజోద్ధతమధునిభవ, క్త్రనటన్మోదాశ్రు వయ్యె రఘుపతి నభిషే
చనబహుగుణితద్యుతి గనుఁ, గొనుటకుఁ గనుదోయి గడుగుకొనియెడుభంగిన్.

10


మ.

మనువంశాగ్రణి జాగ్రదగ్రసుతసామ్రాజ్యగమప్రాజ్యమ
జ్ఞానసంమర్ధజ భూరజఃపరిజిహీర్షాచుంచురోమాంచకా
యనికాయప్రకృతివ్రజద్విగుణజాతానందమున్ డెందమం
ద నిగూహించుచుఁ బల్కె నాప్తసచివోత్తంసాళితో నత్తఱిన్.

11


ఉ.

నే మవనప్రసక్తి నవనిన్ భరియింప ని దే మొకో జన
స్తోమము శైలజారమణుజూటవిటంకసుధాంశుధాము శ్రీ
రాము నఖండమండలధురంధరుఁగా గణియించి నించెఁ గా
మామది కద్భుతం బనుడు మంత్రులు పల్కి రుదారచాతురిన్.

12


ఉ.

ధారణి నావరించి యవదాతయోనిభు లైనమీర లు
న్నారె కదా జనౌఘమయి నారఘునాథు శరణ్యుగా మదిన్
గోరకయున్నె యూరక చకోరక మాఁకలిగొన్నచో విధుం
జేరక చేరునే యమృతసింధువుఁ దజ్జనకత్వబంధువున్.

13


క.

అనియెడు మంత్రులుఁ దారు, న్జను లపుడు వసిష్ఠుశాసనంబున నభిషే
చన సంభారాహరణం, బునకుం ద్వరపడఁగ నృపతి పుంగవుఁ డంతన్.

14