పుట:Chanpuramayanam018866mbp.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వెల్లంటివారును గూడ బూర్వపుసాళువరాజులబిరుదముల దమబిరుదములుగా జేసికొన్నారు.

కసవరాజువంశము గ్రంథములో నిట్లు వర్ణింపబడినది. కరికాళచోళుని వంశములో సింగరిరాజు పుట్టెను. సింగరిరాజునకు శ్రీరంగరాజును, శ్రీరంగరాజునకు సింగరిరాజును, సింగరిరాజునకు గావేరిరాజును, గావేరిరాజునకు సింగరిరాజును, సింగరిరాజునకు గావేరిరాజును, గావేరిరాజునకు గసవరాజు, సింగరిరాజు, తిరువేంగళరాజు, పెరుమాళ్రాజు ననునలువురు కొడుకులును బుట్టిరి. ఈకసవరాజే కృతిపతి. కసవరాజుపిదప నేడవతరమువా డగుబ్రహ్మరాజు కాలమున బుట్టిన 1 పద్మావతీపరిణయ మనుసంస్కృతచంపూగ్రంథ మీవంశక్రమమును దృఢపరుచుచున్నది. ఆగ్రంథములో గసవరాజునకు మారు కేశవరా జనియున్నది. కసవయనునది కేశవశబ్దభవము కాబోలును. కసవరాజు తరువాతి తరములవారు పద్మావతీపరిణయములో నీరీతిం జెప్పబడినారు:--

కసవరాజు పిమ్మట నతనితమ్ముడైన వేంకటపెరుమాళ్రాజు రాజ్యముచేసెను. అతని యనంతర మాతని యన్నకొడు కగుబ్రహ్మరాజు రాజ్యముచేసెను. బ్రహ్మరాజుకొడుకులు కావేరిరాజు వేంకటపెరుమాళ్రాజులు. వేంకటపెరుమాళ్రాజు కొడుకు బ్రహ్మరాజు ; అతని కొడుకులు కుమారువేంకట పెరుమాళ్రాజు, కావేరిరాజు, తిరుమలరాజు, సుందరకృష్ణరాజును. కుమారవేంకటపెరుమళ్రాజు కొడుకులు బ్రహ్మరాజు మొదలగువారు. ఈబ్రహ్మరాజే పద్మావతీపరిణయ కృతిపతి. కసవరాజునకు బ్రహ్మరాజునకు నడుమ నయిదుగురు రాజ్యముచేసినట్టులు దీనివలన గనబడుచున్నది. ఈగ్రంథములో గుమారవేంకటపెరుమాళ్రాజు తారణ సంవత్సర చైత్రమాసములో లోకాంతరగతు డైనట్లును, నాసంవత్సర జ్యేష్ఠమాసములో బ్రహ్మరాజు పట్టాభిషిక్తు డైనట్టును బ్రహ్మరాజునాజ్ఞ ననుసరించి యాగ్రంథము వికృతిసంవత్సరమునం దచ్చుపదినట్లు నున్నది. తారణసంవత్సరము 1884-వ క్రైస్తవసంవత్సరమునకును, వికృతిసంవత్సరము 1890 సంవత్సరమునకును సరిపోవును. కుమారవేంకటపెరుమాళ్రాజు సవతితమ్మ డగుతిరుమలరాజున కంకితమైనట్టియు, గరుడాద్రి సుబ్రహ్మణ్యవిద్వత్కవి ప్రణీత మైనట్టియు శత్రుఘ్న