పుట:Chanpuramayanam018866mbp.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చంపూరామాయణము

ద్వితీయాశ్వాసము

క. శ్రీజనక ధీర బొమ్మ, క్ష్మాజనపతిగర్భశుక్తిమౌక్తిక చినకృ
ప్లాజిమదేవీమానస, రాజీవమరాళ! కసవరాజనృపాలా! 1

మ. అమరు ల్గాంచి రవేలకేళి జలమర్త్యస్త్రీసమాలింగన
ప్రమదాపాది పయోవినోది ఘనగర్జానీతవేలావన
ద్రుమయూరీనటనావలోకపరయాదోరాజదారేక్షణ
భ్రమకృద్వల్లనమీనధోరణి సుధాపాథోనిధిగ్రామణిన్. 2

సీ. పాథోదసమితికిఁ బానీయశాలిక ఫణిరాజశాయికిఁ బడుకటిల్లు
మనుముద్దరాలికి మగఱాలమొలనూలు కలవానిచెలికాని కలరుఁదోట
మింటికాపరులకు మృష్టాన్నసత్రంబు సకలదివ్యవదాన్యజన్మభూమి
మఘవగజాంతసంపద కాదికారణం బఖిలాచలేశున కనుఁగుటల్లుఁ
గీ. డార్యతోఁబుట్టుగట్టురాయలపతత్ర, యుగళికిఁ దనుత్ర మెవ్వఁ డయ్యుదధి గాంచి
నీలవర్ణుండు నిద్దుర మేలుకాంచి, యున్నవేళ విచారించి యుత్సహించి. 3

మ. కలశాబ్ధిం దెలిదీవి నైందవశిలాగారంబులో ముత్యపుం
దళుకుందిన్నియమీఁదఁ గల్పసుమనస్తల్పోపరిం జిల్వరా
యలమై నిద్దపుగద్దెపీఁటపయి సధ్యాసీనుఁడై యెఱ్ఱజీ
రుల కన్గ్రేవల నమ్రపత్రముల బారుల్ దీర్చు భద్రాకృతిన్. 4

సీ. రోహణాచలశృంగమోహనాకృతిఁ జొకాటం బగుమణికిరీటంబువానిఁ
దొగలకు నెత్తమ్మితెగలకు దాంపత్య మాయితం బిడుకన్నుదోయివాని
మొసలిపోగులనిగ్గుటొసపరిసాముకూటము లైనచెక్కుటద్దములవానిఁ
గలుములొయ్యారియుయ్యెలపచ్చగొలుసుతీ రగునురస్థ్సలివైజయంతివాని
గీ. నంబుదతటిన్నిభశుభాంబరంబువానిఁ, గమలజాండంబునకు నాల్గుకాళ్లమండ
పంబిడుభుజావిజృంభణంబైనవాని, హరిఁ గని నుతించి ర ట్లని యమరు లపుడు. 5