పుట:Chanpuramayanam018866mbp.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
16
చంపూరామాయణము.

గీ. ఋషి యొకఁ డొనర్చు పుత్రకామేష్టి వలన
నందనులు నీకుఁ గలుగనున్నారటంచు ము
న్నలసనత్కుమారుచే విన్నకథను
మంతుఁ డెఱిఁగింప ముదమంది మహిపుఁడంత. 99

వ. శాంతాకుటుంబియుం దనకు సంబంధియు నగునంబుజోదరపదాంభోజరోలంబాంతరంగు ఋష్యశృంగు రావించి యవ్విరించి చంచదాగమప్రపంచపారగుం డుపద్రష్టగా వసిష్ఠవామదేవాధిష్ఠితం బగువాజిమేధంబు సరయూధునిరోధంబున నిర్నిరోధంబుగా నిర్వర్తించి పుత్రీయయగు నిష్టిక్రియ కుపక్రమించు తఱి నశేషభువనశోషణప్రవీణరావణప్రతాపరేఖానిదాఘదారణంబున కాదికారణంబును నభంగశార్ఙ్గచక్రచాపాభిరామంబును నకూపారవరకుమారికాచిరవిఫాలితాలలామంబును నఖిలతాపసవ్రాతచేతశ్చాతకోపరివికీర్యమాణనిరవధికృపారసజలౌఘంబును నగుకృష్ణమేఘంబు నూతనాతసీగుచ్ఛసచ్చఛాయ నిజతనుఃప్రభాపూరంబునఁ గలశపారావారంబు నభినవకువలయాకారంబు గావించు ఠావునకుం బోవ నూహించి మణివిపంచిపాణి వాణి వదనంబునం[1] బొసఁగుసరసునిం బురస్కరించుకొని నడచి యొండొరులం గడచి ముందఱ. 100

శా. నారీనూతనపంచబాణ! కవితానైపుణ్యపారీణ! కా
వేరీక్ష్మావరగర్భసింధురమణావిర్భూతరాకానిశా
తారాకాంత! దిగంతవైరిముఖపద్మస్తోమహేమంత! చిం
తారత్నప్రతిమానదానగరిమత్రాతాఖలార్థివ్రజా! 101

క. భారతభాగవతకథా, నారాయణదేవదివ్యనామశ్రవణా
నారతసుకృతైకపరి, ష్కారభ్రాజిష్ణుకర్ణ! కలియుగకర్ణా! 102

స్రగ్విణి. వీరచూడామణీ! విశ్రుతౌజోహృతా, శారణీ! భూరిభోగామరగ్రామణీ!
సూరవంశాగ్రణీ! సుస్థిరోదారదో, స్సారసామిరణీ! శబ్దవిద్యాఫణీ! 103

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదసమాసాదిత సరసకవితావిలాస వాసిష్ణవంశకీర్తిప్రతిష్టాసంపాదక ఋగ్వేదికవితిర్వేంగళార్యకలశరత్నాకరసుధాకర జగద్విఖ్యాతకవిరాజకంఠీరవబిరుదాంక వేంకటాచలపతిప్రణీతం బైనచంపూరామాయణం బనుమహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.  1. వేణి పదాంకంబునం (మాతృక)