పుట:Chandrika-Parinayamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అప్పుడు మన్మథుఁడు తన యస్త్రశస్త్రముల నరణ్యమునందే పారవైచి వసంతమలయానిలశుకపికాదిపరివారముతో పారి పోయెను. చిత్రరేఖ భయపడి మునిపాదములపైఁ బడి, ‘మహాత్మా! మీప్రభావము నెఱుఁగక చేసిన నా యీయపరాధమును క్షమింపుఁడు. మర్త్యకాంతనై పుట్టి దుష్టసమాఖ్యుఁడగువానిఁ జెట్టఁబట్టియుండు దుర్గతిని నాకుఁ దొలఁగింపుఁడు. మీశాపమును మరలింపు’డని ప్రార్థించెను. ఆప్రార్థనముచేతఁ గరుణాయత్తచిత్తుఁడగు ముని ‘ఓ నారీమణీ! నాశాపము అమోఘము. ఐనను దాని కన్యధార్థము గల్పించి నీ వనుభవించునట్లు చేయుదును. ‘సుదోషాకర’శబ్దమునకు అధికదోషములు చేయువాఁడను అర్థమునకు బదులు రాత్రిని గలిగించు చంద్రుఁడనియు, ‘ఇరాపుఁడు’ అనుశబ్దమునకు మద్యపానముఁజేయువాఁడను నర్థము నకు బదులు భూపాలుఁడు అను నర్థమును ఉండుటచేత నీవు ‘సుచంద్రుఁ’డను పేరుగల రాజును బెండ్లియాడుమని శాపవచనా ర్థము తేలును. కావున నీవు మర్త్యలోకమునఁ బుట్టినదానవై సుచంద్రమహారాజును బెండ్లియాడి శతసహస్రవత్సరములు సకల రాజభోగము లనుభవించి పిమ్మట స్వస్వరూపమును బొంది స్వర్గమునకు వెళ్ళెదవుగాక’ యని శాపమును సడలించెను. చిత్ర రేఖ తృప్తిపడి సఖీజనముతోఁ దన కేళికాగృహమునకుఁ జేరెను.

మునిశాపవశమున చిత్రరేఖ భూమండలమున బాంచాలదేశము నేలు ‘క్షణదోదయుఁ’డను రాజునకు ‘శ్యామ’ యను భార్యయందుఁ గన్యయై పుట్టి ‘చంద్రిక’యని పిలువఁబడెను. బ్రహ్మదేవుని కీవార్త తెలిసి చింతించి అట్లు మర్త్యస్త్రీయై పుట్టిన యామెకు పెక్కుదివ్యచిహ్నములు గలిగించెను. ‘కుముదుఁ’డను నామధేయముగల నన్ను భూలోకమునకు వెళ్ళి ‘చంద్రిక’కు వీణావాదనము నేర్పుమని చతుర్ముఖుఁ డాజ్ఞాపింపఁగా నేను వచ్చి పూర్వస్నేహముచేత నామెను వీణావాదనచతురను గావించితిని. ఇతోధికనైపుణ్యము నాచంద్రికకుఁ గలిగింపఁ దలఁచి యొకనాడు శారదాదేవిసన్నిధి కేగి కొన్ని వింతరాగములు విని వాని నామెకు నేర్పఁదలఁచి ఆకసమునుండి భూలోకమునకు వచ్చునపుడు నిండుజవ్వనమున మిసమిసలాడు చక్కని యొక మునికాంతను జూచి యీతలిరుఁబోణిని గలియఁజాలని జన్మము జన్మమే? యని కామమోహితుఁడనై యాతాపసాంగన సంచరించు గృహమువద్ద మునులమహా