పుట:Chandrika-Parinayamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విప్రుని తపోగ్నిజ్వాలలచేతఁ గందిపోయిన మహామనుసువర్ణదేవతలు వచ్చి, బ్రహ్మకుఁ బ్రదక్షిణముఁ జేయుచుండ వానినిఁ జూచి బ్రహ్మ మీకీ దుస్థితి యెట్లు వచ్చెనో తెల్పుడని యడిగెను. వారు ప్రభూ! పారిజాతారణ్యమునందు తన తపశ్శక్తిచేత బ్రహ్మత్వమును సంపాదింపఁ దలచిన వసంతుఁడను నొకడు మా జపవ్యాపారపారంగతుఁడై, సర్వేంద్రియనిగ్రహము గలవాఁడై, నిశ్చలాంతరంగుఁడై, మాయక్షరసంఖ్యను లక్షోపలక్షలుగా జపించుచు, మాకు తాపమును గలిగించుచున్నాఁడు. దీనిని అణగించుటకుఁ బ్రయత్నింపుమని కోరిరి. ఔరా! అతఁ డిట్లు చేయునా? యని బ్రహ్మ యాలోచించుచుండఁగా నింద్రుఁడు ప్రభూ! ఆ యతియనఁగా నెంత? వాని జపమెంత? వ్రత మెంత? తపమెంత? మేనక, ధాన్యమాలిని, ఊర్వశి మొదలగు దేవవేశ్యలు, మన్మథుఁడు నుండఁగా మీకు విచార మెందులకు? అనఁగా బ్రహ్మ సంతసించి కంతుని బిల్వఁబంచి వేల్పునవలామిన్నలను జూడఁగా వారందఱు వెలవెలపాటు నొందుచుండ, చిత్రరేఖ నలువకు నమస్కరించి నన్నుఁ బంపుడనెను. మరుని సహాయముతో నా మునితపస్సును భగ్నముఁజేసి మీ ముందు నకు దెచ్చి యుంచెద ననెను. అంతలో మన్మథుఁ డచటికి వచ్చెను. బ్రహ్మ యతనిని గౌఁగిలించి, యాసనస్థుని జేసి, యతనికి దనకార్యమును దెలిపి, యా యతిని అబలాపరిచారకునిఁ జేయుమని యంగజుని గోరెను. మన్మథుఁడీ పనికి నన్నుఁ బ్రార్థింప వలెనా? ఈ సురకార్యము నాది కాదా? యని చిత్రరేఖతోను, పికసైన్యములతోను, సకలపరివారముతోను బయలుదేరి ముని తపఃప్రదేశమును జేరఁబోవు నప్పు డెన్నియో యపశకునములు గలిగెను. ఆ యపశకునములను లెక్కింపక మన్మథుఁడు చిత్రరేఖతో మేరుపర్వతమార్గమున సత్యలోకమునుండి దిగి, తపోలోకము దాటి, జనర్లోకము చేరి, మహర్లోకము నొంది, స్వర్లోకమును సమీపించి, భువర్లోకమును దాటి, భూలోకమునకుఁ జేరెను. అచ్చట వింధ్యాద్రిసమీపమున నర్మదానదీజలకణముల చేతఁ బుష్పించిన పారిజాతవనము కన్నుల కింపు గూర్పఁగా నచ్చటి మున్యాశ్రమము నెఱిఁగి యచ్చట మందమారుతమున మార్గాయాసమును దొలఁగించుకొనెను. తనసైన్యము నంతటిని దింపెను. కుసుమశరములు దాల్చి శుకకోకిలభృంగనాదములు చెలరేఁగగా మునిని జుట్టుముట్టెను. అబ్జాస్త్రములు నించి ప్రయోగించెను. పెక్కుబాణములు వేసి యతనిఁ జలింపఁజేయ సమ