పుట:Chandrika-Parinayamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన్మూలకమగు ‘ప్రమ’ సిద్ధించుచుండఁగా, అన్వీక్షకీవరు లనఁగా న్యాయశాస్త్రప్రవీణులు, ‘ధూళి’ అవ్యాప్తము, దానివలనఁ గల్గు ‘ధూమధ్వజాకరధీ’ , అనఁగా వహ్నివిషయకజ్ఞానము ‘అప్రమ’ యని యెన్నఁడును దలంపరు. అట్లు తలంచువారు అతార్కికులై యుందురని భావము. ‘తస్మిన్ తత్ప్రకారజ్ఞానం ప్రమా’ (ఉన్నదున్నరీతిని గ్రహించు యథార్థజ్ఞానము ప్రమ). దానికి విరుద్ధమైనది ‘అప్రమ’ -ఇదియే భ్రమ (అతస్మిన్ తద్వత్తా బుద్ధిః). అవ్యాప్తి యనఁగా (లక్ష్యైకదేశే లక్షణస్యాసత్వం) లక్ష్యములోఁ గొన్నిచోట్ల లక్షణము సరిపోకపోవుట. ఈతెలుఁగుపద్యమునం దీవిధమగు తర్కశాస్త్రవిషయమును, పారిభాషికపదజాలమును గూర్చుట వలన నీకవి కాశాస్త్రమునందు దృఢప్రవేశము గలిగియుండెనని స్పష్టపడుచున్నదికదా!

స్థిరతపనీయసారసన దీప్తిమృషా తపనాతపంబు భా
స్వర కటిహర్మ్యనాభిమిషజాలకవీథికఁ బర్వినన్ దదం
తరమున నక్షిలక్ష్యగతిఁ దాల్చిన సూక్ష్మతరాణు వౌఁ జుమీ
కరికులరాజయాన నునుగౌను మనంబునఁ జింత యూన్పఁగన్’

(ఆశ్వాత్రి. ప.11)

నాయికయగు చంద్రిక ‘అణుమధ్య’. ఆమెనడుము అణుప్రమాణమని సామాన్యకవు లందందుఁ జెప్పినట్లుకాక సహేతుకముగా సశాస్త్రీయముగాఁ జెప్పుట. ‘జాలసూర్యమరీచిస్థం సూక్ష్మం యద్దృశ్యతే రజః, తస్య షష్ఠతమో భాగః పరమాణుః ప్రకీర్తితః’ – గృహముయొక్క గవాక్షమార్గమునఁ బ్రవేశించు సూర్యకిరణములకాంతిలో సూక్ష్మముగాఁ గనపడు రజోరేణు వేదికలదో, దానిలో ఆరవభాగమంత యుండునది పరమాణువు. అట్టి స్థితిగల మధ్యము స్త్రీ కెచ్చట నెట్లు గోచరమగుచున్నది? అను ప్రశ్న యుదయించి నప్పు డిదిగో! ఇట్లు, అనుచు నాలంకారికతర్కపరిభాషలతోఁ జెప్పిన పద్యమిది. ‘సారసన’మనఁగా నొడ్డాణము, బంగరు నొడ్డాణపుకాంతి యనెడు సూర్యకిరణప్రసారము, కటి యనెడు మేడలోనికి నాభిరంధ్రగవాక్షముద్వారా జరుగుచున్నపు డచ్చట ననుగౌను=సూక్ష్మమగు నడుము అక్షిలక్ష్యగతిని బొందినది. అనఁగా త్రసరేణువై కవిదృష్టికి గోచరించుచున్నదని భావము. పరమాణువు యోగిబుద్ధి సాక్షాత్కారవిషయ