పుట:Chandrika-Parinayamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నానంద్యమాన, చాంచల్యమాన, బంభ్రమ్యమాణ, లాలస్యమాన, దేదీప్యమాన, జాజ్వల్యమాన, టేటిక్యమాన, జంజన్యమాన, పాపట్యమాన, సనీస్రస్యమాన, జేగీయమాన, చరీచర్యమాణ, బనీభ్రశ్యమాన, ఫాఫల్యమాన, పోపుష్యమాణ, రారణ్యమాన, తాతప్యమాన, వావస్యమాన, నరీనృత్యమానాది శబ్దప్రయోగములు చేసి యావచనరచన కసాధారణశోభను జేకూర్చి తన వ్యాకరణశాస్త్రపరిచయమును వెల్లడించెను. ఈ చూపఁబడిన వ్యాకరణవిశేషములు స్థాలీపులాకన్యాయమున జూపఁబడినవే కాని సాకల్యముగాఁ జూపినవి కావు. కావ్యమునందు ప్రతిచోటను శ్రీమాధవరాయల వ్యాకరణశాస్త్రపాండిత్యము తద్జ్ఞులకు సాక్షాత్కరించుచునే యుండును. సంస్కృతవ్యాకరణమునందేకాక తెలుఁగు వ్యాకరణమునందును ఇతనికి విశేషపరిచయముండినట్లు ఈక్రింది ప్రయోగములు సూచించును.

తెలుఁగు వ్యాకరణ పరిచయము:

చ॥ ‘అనుపమ ధాతుధూళియుతి… …
… ….. గ్రాలెడు పొన్న నృపాల! కాన్పు’

(ఆశ్వా2 ప.9)

‘ధాతువుయొక్క కృదంతరూపము ‘కాన్పు’ చూచుట, కనుట యను నర్థములు గల యా సుబంతమును ‘చూడుము’ అను నర్థము గల క్రియగాఁ బ్రయోగించుట ఒక విశిష్టప్రయోగము. మరియుఁ ‘గాన్పుమో నృపా!” (2.14) అనియు ననెను. ‘వింటే…గొంటే యౌముని దెచ్చినాఁడిటఁ దపఃకుల్యాధ్వసంచారితన్’ దుష్టవాచకమగు ‘కొంటె’ శబ్దమునకుఁ ‘గొంటే’ యను నది రూపాంతరము.

“ఆనారీమణులంత … … … … … … ఆభూపకన్యామణి
న్వ్యానమ్రాననచంద్ర నుంచి శిరసంటం జేరి రింపెచ్చ ‘శో
భానేశోభనమే’ యటంచు విబుధాబ్జాతాననల్ పాడఁగన్.”

(ఆశ్వా 6 ప.13)