పుట:Chandrika-Parinayamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే॥ బరఁగుఁ గఠినాద్రి జడలుఠ జ్జరఠకమఠ
కూటకిటి గూఢచరణ దిక్కోటికరటి
కుటిలతాసహ భూ సౌఖ్యఘటన భూరి
భుజబలవిహారి యార్వీటి బుక్కశౌరి.

(వసుచరిత్ర ఆశ్వా. 1 ప.28)



చ॥ అలఘు మనోభవోదయకరాంగయుతిం దగు నా మిళిందకుం
తల, నలమీననేత్ర, నలతామరసానన, నాపికారవో
జ్జ్వల వరమంజులాబ్జగళసంగత, నాబిసబాహ, నాప్రవా
ళలలితపాద, నాచెలిఁ దలంపఁగ నీకె తగున్ నృపాలకా!

(చంద్రికాపరిణయము ఆశ్వా. 3 పద్య.31)



మ॥ కమనీయాకృతి యోగ్యకీర్తనములం గన్పట్టు నాశ్యామ, యా
సుమబాణాంబక, యాయమూల్యమణి, యాచొక్కంపు పూబంతి, యా
సుమనోవల్లరి, యాసుధాసరసి, యాసొంపొందు డాల్దీవి, యా
కొమరుంబ్రాయపురంభ, యాచిగురుటాకుంబోడి నేకే తగున్.

(వసుచరిత్ర ఆ. 2 ప 52)



సీ॥ మంజులాహీన హర్మ్యప్రదేశంబున శుచిగరుత్మల్లీలఁ జూచికొనుచుఁ,
గలధౌతమయ శైలకందరాస్థలుల మహానంది హరిలీల లరసికొనుచు,
సుమనోనివాస భాసురనగాగ్రములందు దివ్యసారంగాభఁ దెలిసికొనుచు,
పుష్కరవీథులఁ బొలుపొందు నేకచక్రరథవిస్ఫూర్తినిఁ గాంచికొనుచుఁ,

తే॥ గమల దైత్యారి, శర్వాణి కమలవైరి
ధారి, పౌలోమి యుర్వరాధరవిదారి,
ఛాయ హరి, యన నలరిరి సకలకాల
సముచితాఖేలనంబుల సతియుఁ బతియు.

(చంద్రికాపరిణయము ఆశ్వా3 పద్య31)