Jump to content

పుట:Chandrika-Parinayamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూలఙ్కషాబుద్బుదశ్రేణికారూపముక్తావళీభాస మానే! శుభామోదికాశ్మీరకస్తూరికాపఙ్కచర్చాపరిద్యోతమానే! మనోజ్ఞాస్యపద్మాహితార్చాపరామ్భోజ బాణప్రతిష్ఠాపితామూల్యశఙ్ఖీభవత్కన్ధరే! పాణితప్రాణబన్ధూభవద్భవ్యవాగ్బన్ధురే! సలలితఖగచక్రాఙ్గకాణ్డ ద్విజావిక్షతాఙ్కాన్వితప్రస్ఫురత్పక్వబిమ్బప్రతీకాశరమ్యోష్ఠబిమ్బే! నవాదర్శసద్గర్వనిర్వాపణోద్యుక్త గణ్డద్వయాంచన్మరీచీకదమ్బే! స్వకశ్రీసమఙ్కూరిత త్రాసయోగాటవీ లీన కున్దోపరివ్యక్త నవ్యానుకమ్పా రసోహాకరాశ్రాన్త వీటీరసవ్యాప్త దన్తాళికాద్వైతవా ద్యుజ్జ్వలద్దాడిమీబీజజాలే! సునాసాజితామూల్యసౌవర్ణ జాలే! లసత్కజ్జలాఙ్కోపధిత్రోటికాయుక్తరమ్యాస్యలావణ్యకేళీవనీవీథికా సంచరత్ఖఞ్జరీటాయమానోల్లసల్లోచనే! భ్రూలతాయుగ్మసంప్రాపితానఙ్గచాపత్విషామోచనే, భవ్యకాశ్మీరభూచిత్రకాకార ఫాలాన్తరభ్రాజ మానానిలాప్తేక్షణే! వక్త్రతేజఃపరిక్షీణపూర్ణక్షపానాథకాన్తిక్షణే! సంతతాభ్యర్ణసీమావసద్వేణికారాహుసంద ర్శనోద్విగ్నచేతస్క చూడామణీభూత శీతాంశురేఖా గళత్పాణ్డురస్వేదపాథః పృషన్మాలికా మోహదా నర్ఘ్యముక్తాలలన్తీలతాలంకృతే!రత్నతాటఙ్కయుగ్మాన్వితే! కాలకణ్ఠాన్తరఙ్గప్రమోదప్రదాప్రత్నచామ్పేయ దామాఖ్య సౌదామినీవల్లికాయుక్తవేణీపయోదాభిరామే! నతాగారిరామే! సతత మగజే! త్వమే వాత్మమాతా శివే! త్వాం భజే దేవదేవి! త్వయా రక్షితోఽహం విశాలాక్షి! తుభ్యం మనోభక్తి విత్తం దదామ్యమ్బికే! నాశ్రయామి త్వదన్యాం మహాకాళి! దాస్యం తవ ప్రాప యాబ్జావతంసే! త్వదీయే పదాబ్జ ద్వయే సంవసత్వస్మదీ యాశయో గౌరి! రక్షాద్యమాం, దేవి! తుభ్యం నమో, యోగిమృగ్యోజ్జ్వలచ్చిత్కళాయై నమో, గోధిభాః కృత్తరాత్రీట్కలాయై నమో, ౽ శేషగీర్వాణనిత్యోత్సవాయై నమో, నిత్యపూతామిత ప్రాభవాయై నమో, హస్త సంబద్ధనీరేశయాయై నమో, దేవతారూపశయ్యాశయాయై నమస్తే, సఖీభూత పద్మాలయాయై నమస్తే, స్వభక్తాళిచిత్తాలయాయై నమస్తే, మృగాధీశవాహోత్తమాయై నమస్తే , పయో జాస్త్రశత్రూత్తమాయై నమః, కాన్తిమత్యై నమః, కాన్తమత్యై నమ, స్సర్వసూత్యై నమ, స్సౌమ్య భూత్యై నమ, శ్శర్మదాయై నమ, శ్శైల జాయై నమః, కామదాయై నమః, కాళికాయై నమస్తే , నమస్తే, నమః. 31