పుట:Chandrika-Parinayamu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దండకము

జయ జయ జగతీనాయికే! భక్తలోకేష్టసంధాయికే! నిత్యబిన్దుత్రికోణాష్టకోణాదికోణావళీవిస్ఫురచ్చక్ర సింహాసనోద్ద్యోతమానాత్మికే! సర్వమన్త్రాత్మికే! సద్వటానోకహోపాన్తసీమావసద్బోధముద్రాన్వితాశామ్బరస్వాన్తనిద్రాళుపఞ్చాశుగోన్మీలనాకారకాపాఙ్గసంచారభఙ్గీసముద్భూతసర్గాదికార్యత్రయీసక్తవైధాణ్డభాణ్డప్రకాణ్డే! దయాత్రాతయోగిప్రకాణ్డే! వినీలాఙ్కరేఖావృతాబ్జారిబిమ్బోపమాసమ్మిళత్కుణ్డలీ భూత హీరోపలప్రోత కోదణ్డదణ్డోత్తమోద్వాన్త శైత్యప్రకారోజ్జ్వల ద్గోనికాయోపభుక్తోగ్రధూమ్రాక్ష దర్పచ్ఛలధ్వాన్తికే! వార్షుకామ్భోదజిత్కాన్తికే! రోచమానాత్మభూమిత్రతారాహితీయుక్త చిత్రక్రియా సంచరన్మధ్వవష్టమ్భ విధ్వంసనోదార లక్ష్మీశనిద్రాపహార్యద్భుతక్రీడనాశాలి మాయాఘనప్రక్రమాభ్యఞ్చితే! సత్కు లాళీనిరాకుఞ్చితే! మత్త దన్తీన్ద్రగర్జామృదఙ్గవ్రజధ్వాన దైత్యేన్ద్రసేనావళీ సింహనాదాఖ్య గానాభిరఙ్గన్మహా జన్యరఙ్గస్థలీ నృత్య దుగ్రాసివల్లీ నటీప్రాపితా ప్రత్నపుష్పాఞ్జలీభూతశుమ్భాదిక క్రవ్యభుఙ్మాలికా నిర్గళ న్మౌక్తికశ్రేణికే! పుణ్య మర్త్యోత్కరారోహ్య సౌభాగ్య సౌధార్పితోదార కారుణ్యనిశ్రేణికే! శివగృహిణి నిజౌ పమ్యలీలా నిశోజ్జృమ్భమాణేన్దుజాయా పరివ్యక్తజాగ్రత్క్రుధాఙ్కూర శఙ్కాసమాపాది లాక్షారసోల్లిఙ్గి తాంఘ్ర్యబ్జ దీవ్యన్నఖవ్రాత విభ్రాజితే! దేవతాపూజితే! నిత్యసత్కాన్త సంసేవ్యపాదామ్బుజాతాధరీభూత పద్మాకరోదయాఞ్చితామ్భోజ హైన్యక్రియావాచి శిఞ్జారవోద్భాసిమఞ్జీరభూషానుషఙ్గే! కనజ్జాఙ్ఘికశ్రీజి తోద్యన్మనోభూ నిషఙ్గే! మహాయౌవనాళీకమల్లాదిభూకేళికాస్తమ్భ సంవిత్ప్రదాత్రూరుకాణ్డే! సరోరాజ సౌభాగ్యజిన్నాభికుణ్డే! వలగ్నస్థలీకార్శ్యజిజ్ఞాసుపుష్పేషుబద్ధస్ఫురన్ముష్టికాబన్ధన ప్రోత్థగమ్భీరనాభీ గుహాన్తస్తటధ్వాన్త రేఖామనీషాప్రదశ్యామరోమాళికే! సారశృఙ్గారవారాశిభఙ్గప్రమాకృద్వళీపాళికే! చారు తారుణ్యమాయా మహాకుమ్భికుమ్భద్వయీద్వాపరద్వారవక్షోభవే! పాణిభాత్రాతపాథోభవే! సంతతా సక్తసర్వజ్ఞదృగ్జాత పాతక్రియాజాయమానాత్మలావణ్య