పుట:Chandrika-Parinayamu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలయు వెలయువిదల గలితచందనచర్చాపాలి కలం గనత్తరదరహాసవిభారింఛోళికలం గర్ణావతంసిత కైరవపత్త్రమంజరికావిభాళికలం గబరికాభివేష్టిత లతాంతమాలికలం గలసి మెలఁగుచు, మహోత్పలమండల త్రాణైకవిహారవిలాసితం బయ్యును మహో త్పలమండలహరణైకవిలాసాంచితంబై యసమకాండ చండప్రతాపనాశకనిజోదయంబయ్యును నసమ కాండచండ ప్రతాపసంవృద్ధికరనిజోదయంబై, దివ్యచక్ర చిత్తానందసంధాయకం బయ్యును దివ్యచక్రచిత్తా నందభేదకం బై రాజిల్లుచు ద్రుహిణాండకరండంబునకు వెండి జలపోసనంబుదారిం బ్రకాశించె నయ్యవస రంబున. 107

మ. అలపాంచాలకుమారి యేపఱి సువర్ణాంచత్పరాగాళికిన్
నెలవై రా నలకాండధామగతి కెంతేఁ దోఁచి పెల్లేఁచ వె
న్నెల వై రానలకాండధామనయనోన్మేషస్ఫురత్కోకిలా
బల మ్రోయన్ వెఱ నూని మున్ సితరుచిన్ బల్కున్ విరోధోక్తులన్. 108

చ. కమలక యౌర్వహేతితతి గాఢనవోదయరాగకీలిచేఁ
దెమలక రాహువక్త్రసముదీర్ణవిషాగ్ని నడంగ కున్నమ
త్కమలకరాళికాధికశిఖాహతిఁ దూలక పొల్చి తక్కటా
కమలకరాళికాధిగతకాలుషి నేమన వచ్చుజాబిలీ. 109

శా. స్వచ్ఛాయన్ వనితాళిఁ దూల్చుటలు, దీవ్యచ్చక్రమోదచ్ఛిదా
స్వచ్ఛందోహ! యనూనధామహృతచంచత్తావకోజోఖిల
స్వచ్ఛందోహయమాన మేఁచుటలొ యుష్మద్భేదనాఢ్యాంఘ్రిభా
స్వచ్ఛందోహయమాన మేఁచుటలొ నిచ్చల్ దల్పుమా హృత్స్థలిన్. 110

సీ. అనురక్తి పొదల దివ్యాచార్యునవలా ల
లితకంతుకేళికాగతిఁ దెమల్చి,
మాతంగసఖ్య మేమఱక గన్నవలాల
నేలు మారునిచెల్మి నెడయ మాని,