పుట:Chandrika-Parinayamu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధుకర ఝంకారంబులు గర్జనంబులై నిగుడం బొడసూపు వెన్నెల జడివానగాఁ దలంచి యౌదలలఁ బయ్యెదలు గప్పి నెచ్చెలికేలు కైలాగుఁ బూని బుడిబుడి రయం బడర నడచు పడఁతిమిన్నల యున్నతస్తనాంతర విలంబమాన ముక్తా హార గౌరరుక్తతిం బునరుక్తం బగుచు, వెగ్గలమై నెమ్మదిఁ గ్రమ్ము సిగ్గు వెనుకకుఁ దివియ నగ్గలిక మరుండు వైచు మొగ్గములికిగములు ముంగలికి నూకం గరంబు మదంబున దూఁగి యాడు వలదొరపట్టంపుటేనుంగురంగునఁ జూపట్టుచు నెచ్చెలుల కుశలత్వంబున మందమందకలనం బునఁ గేళికామందిరంబులు చేరి యధిపుఁడు కరంబు పట్టి శయ్య నుంచి ముత్తియంపుపేరు లంటుపేరఁ జన్నులు ముట్టుచు మురిపెంపు నెమ్మోమున మడుపు నందిచ్చుదారిఁ గెమ్మోవి నొక్కుచు దమి రేఁచి బంధురబంధవిశేషసంబంధంబున ననవిల్తుకయ్యంబునఁ జొక్కించి చొక్కంపుఁగళల యిక్కువ లెఱింగి మిక్కిలి గలయ గ్రక్కున వెక్కసంబై తనువునఁ జెమటలు గ్రిక్కిఱిసిన మదనమాయావిలసనంబునం బొడమిన ప్రోడతనంబున నెంతగమ్మంబు గ్రమ్మెనని పతులకుఁ దెలియకుండం బలుకుచుఁ జేలచెఱంగున విసరికొను నవోఢానికరంబుల ధవళాంబరాంచల విభాతరంగంబులం బొంగి పొరలుచుఁ, దొలుతటి కలయికల మన మలరఁ గలసిన చెలువరతనంబులఁ దలఁపునం దలఁచుచు నలమరాని విరాళిం గొని నెల వొడుపు వెనుక నలరువాల్దొరకలికిఁ జెలరేఁగన్ దమి నేతెంచినపతు లపుడు తమయెడఁ బొడముమమత నిదుర గదియమిఁ గెంజిగిం గదురుకొను కనుతుదలును దనుతలమ్మునఁ దొలఁకు గురువిరహజ్వర భరంబున విరిపాన్పునం బొరలఁ జిక్కువడు మణిసరంబులును మరుని యిరువాఁడికైదువు పేరెదం జుఱు చుఱుక్కున నాటఁ దాళక నెఱపు నిట్టూర్పులునుం బరయువతితిలకసంపర్కప్రకారంబు తోరంబుగా నెఱింగింప నలివి యవలిమొగంబై శయనించి మాటిమాటికి బోటికత్తెలపలుకుల నిజప్రేమాతిశయజనిత వియోగవేదనాకార్యంబులుగాఁ దెలిసి యినుమడికూటముల నలమి రతిబడలిక వాయఁ గరం బురం బులఁ జల్లులాడు పువ్వుబోఁడుల శయకుశేశయసమాక్షిప్తఘనసారక్షోదంబులం బక్షీకరించుచు, నలరు మల్లియవిరిసరులు దుఱిమి