పుట:Chandrika-Parinayamu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారకా స్కందనతలంబు చందంబున నభేద్యశక్తిసంయుతంబై, కౌరవపాండవసంగ్రామాంగణంబుచెలువునఁ జక్రికేతనవిదారణచణ భీమగదాక్రియాసముపేతంబై, యమ్మహాసంగరరంగంబు వినుతికెక్కె నయ్యవ సరంబున. 120

చ. చకితనిశాటమై, పతితసాదిజనంబయి, సుప్తయంతృజా
లకమయి, భిన్నకుంజరకులంబయి, లూనరథంబునై, తద
ర్కకులనృపాలశక్తి నిల వ్రాలిన యాత్మబలంబుఁ గాంచి, పా
యక మను రోషరేఖ యెడనంది తమిస్రసురారి యత్తఱిన్. 121

మహాస్రగ్ధర. వరకోదండప్రకాండోజ్జ్వలగుణనినదవ్రాతసాహాయ్యవద్దు
స్తరకంఠక్రోధనృత్యత్కహకహరవముల్ తన్నృపానీకినీభీ
కరలీలన్ దోఁపఁ బ్రోత్థోత్కటరుడరుణితేక్షావిధిం దత్త్రియామా
చరుఁ డక్షీంద్రంబు భూమీశరథము నెదుటం జక్కఁ బోనిచ్చి యంతన్. 122

క. వలయితచాపజ్యాసం
స్థలి రోపత్రితయిఁ గూర్చి జనపతియెద నే
ర్పలవడ నాటించి మహీ
వలయాధిపుఁ గాంచి యసురవరుఁ డిట్లనియెన్. 123

మ. మతి నొక్కింత విచార మూన కురుసంపద్గర్వరేఖ న్మహా
దితిజాధీశవిరోధ మంది యిటు లేతేర న్మనం బుంతురే
రతి ధాత్రిన్ మనఁ గల్గినన్ జనుము మద్రాజద్భుజాదండమం
డితకోదండవినిర్వమద్విశిఖముల్ నిం గాఁడ విప్పట్టునన్. 124

మ. మునివాక్యంబున మోసపోయితివి తన్మూలంబుగాఁ జుమ్ము నీ
కెనసెన్ గాలము మద్రణేహ గనువాఁడెవ్వాఁడిలన్ మించెఁ జొ
చ్చెనొ నీవీనుల లేదొ భూమివర యాజిప్రాప్తదేవేశకృం
తనసంలోలమదాశయాన్యవిధికృద్ధాత్రుక్తమిత్త్రోక్తికల్. 125