పుట:Chandrika-Parinayamu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. యలఘుపలభక్ష్యభోజ్యము లారగించి
మహితచక్రపదాస్థానమండపమునఁ
జక్కఁ గొలువిచ్చె నపు డెద నిక్కువేడ్కఁ
జటులబేతాళవంశ్యరాజన్యసమితి. 119

వ. అప్పు డప్పొలసుదిండిమూఁకలదండం బఖండదోర్దండమండితశౌర్యచండిమంబున నమ్మహీమండ లేశ్వరుం జుట్టుముట్టి యుట్టిపడుకట్టల్క నట్టిట్టు దెమలక పరిఘ పట్టిస ముద్గర గదా భిందివాల తోమర శూలాది నానావిధాయుధ యూథంబులం గప్పి, మరుత్కులాభినుత్య సమిత్కుతల చమత్కారోత్క ర్షంబు సూపుచు విజృంభించినం దిలకించి, మనోంచల ప్రపంచిత ప్రతిఘారస ప్రకాండుండై యామనుజ నాయకమార్తాండుండు వలయితచాపవల్లికాతల్లజంబున నిశితభల్లంబులు గూర్చి నేర్పు వెలయం బఱపి, కరంబులు శిరంబులు పదంబులు రదంబులు నురంబులు నుదరంబులు వేఱుపఱుపరాకుండం దుని యలు చేయుచు నరిభయంకర ప్రచురతర సహోవిభవంబునం దనచటులసాయకచాతుర్యంబు సూపు నెడ నొక్కొక్కయెడ నుదారతీవ్రాశుగధారాప్రచారంబున నుద్వేలకీలాలపూరంబులు బోరునం గురియ ముక్తాహారంబులు సారెకుం బుడమిఁ ద్రెళ్ల విగతకరకంబులై నిజఘనాఘననామంబు నిజం బగుటకుంబోలె ననంతాస్థానంబున భ్రమించు దంతావళసంతానంబులును, నొక్కొక్కయిక్క మిక్కుటం బగు చాంచల్యం బున ధరాపరాగపూగసంవళితంబై రూపఱి నానాజిహ్మగసంహతిక్రమంబునకుఁ దల్లడిల్లుచు నాత్మ హర్యభిధానంబు సార్థకంబు గావించుటకుంబోలె మూలలకుఁ జేరు హయనిచయంబులును, నొక్కొక్క వంక విశంకటశింజినీటంకార జలదగర్జా సమూర్జనంబున నాంతరంబు వ్రీల విముక్తకాండజాతంబులై వాహినీమధ్యంబున గతివిశేష మొక్కింత యెఱుంగక చక్రాంగభావంబు సత్యంబగుటకుంబోలె సడలు స్యందనసందోహంబులును, నొక్కొక్కచెంత సుచంద్రసాంద్రధామ