పుట:Chandrika-Parinayamu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. లపుడు వేవేలు గొలువ, నయ్యవనిభర్త
యిటులు కల్యాణమయరథం బెక్కి వేగ
శిశిరగిరిఁ జేర నరిగె నక్షీణదనుజ
దళనచణదివ్యసాధనోద్భాసి యగుచు. 101

శా. భాస్వన్మండలమధ్యగుం డగురమాభామావిభుండో యనన్
వస్వభ్యంచితచక్రపాదమున నందం బంది భూభర్త సై
న్యస్వాముల్ భజియింప దైత్యకటకేంద్రద్వారభూభృద్దరీ
భాస్వన్మార్గము సొచ్చె నంత ఘనబంభాఘోషముల్ హెచ్చఁగన్. 102

మ. పతి గాంచెన్ నవగోపురేశమకుటాబ్జద్వేష్యుదంశుచ్ఛటా
మతికృత్కేతనధౌతదీప్రము మహాక్ష్మాహంసకజ్ఞానదా
యతవప్రంబు సమగ్రసాలవలయాగాంతస్థితాన్యాచలా
కృతిమత్సౌధసముత్కరంబు దనుజశ్రీమత్పురం బయ్యెడన్. 103

చ. కనుఁగొని యానతియ్య మహికాంతుననుజ్ఞ బలంబు లెల్లఁ ద
ద్ఘనవరణంబు చుట్టి, పరిఖాతతిఁ బూడ్వఁగఁ గోట ద్రవ్వ, గ్ర
క్కున బలుమేరువుల్ నిలుప ఘోరతరోగతి సంభ్రమించెఁ ద
త్స్వనము సురారిపాళి కనివార్యరణక్రమ ముగ్గడింపఁగన్. 104

వ. అంత నద్దురంత కోలాహలార్థవిజ్ఞాపక చారవార వాచా జాయమాన ప్రతిఘాసముద్దాముండగు నా తమిస్రతమిస్రాచరసార్వభౌముం డనూనకువలయ భయంకర కోపాటోపశోణిమధురీణ వదనాంబురుహ బంధుబింబ వినిర్గత కిరణాంకూరమాలికాయమాన నిస్తబ్ధతామ్రశ్మశ్రుజాలుండును, నధరాధర ఫలగ్రాస సమాసక్తోపరి ద్విజోపరిగతాగ్రహ తదితరద్విజారబ్ధ కలహసముదిత నినాదమతికృద్రదనాగ్రాఘాత సంజాతకిటకిటారవ బధిరీకృత పర్యంతవర్తికుండును, నరిరాజహంస మదాపహారి కరశరద ధగధగాయ మాన నూతనైరావతీ ప్రమాకర