పుట:Chandrika-Parinayamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆశ్వాసాంతగద్యలో ‘నుభయభాషాకళత్ర’ యని వేసికొన్న విశేషణము సర్వధా సత్యమని కావ్యము చాటుచున్నది.

శ్రీమన్మాధవరాయనింగారు విజయనగరసామ్రాజ్యమునకు విధేయులై శ్రీకృష్ణదేవరాయల యనంతర మా సామ్రాజ్యమును బెక్కువత్సరములు గాపాడిన అళియరామరాయలవారికి సమకాలికులు. తన పరిపాలనాకాలమున శ్రీరామరాయల సనదును గ్రొత్తచేయించుకొన్నవారు. రామరాజభూషణబిరుదాంచితుఁడగు బట్టుమూర్తి రచించిన వసుచరిత్రయు నితని చంద్రికాపరిణయమును సమకాలికరచనలని యెన్నియో అంతర్బహిస్సాక్ష్యములు గలవు. కాఁగా నీరాజకవి క్రీ.శ.1530 నుండి క్రీ.శ.1600వరకు జీవించియుండె ననియు, విజయనగరసామ్రాజ్యపతనము నెఱిఁగియుండె ననియు చెప్పుటకు వీలున్నది. శ్రీఅళియరామరాయలవలెనే మాధవరాయలును దీర్ఘాయుష్మంతుఁడై యుండినట్లు చంద్రికాపరిణయము సాక్ష్య మొసఁగుచున్నది.

‘తే. ధరాధీశు పిమ్మట నఖిలభూమి
భరము నీవు ధరించితి కిరికులేంద్ర
కమఠవల్లభ కులశైల కరటిసంస
దురగనాథులతోడఁ బెన్నుద్ది వగుచు.’

కుమారమల్లభూపాలుని (ఇతని సోదరుఁడు) పిమ్మట మాధవరాయలు రాజ్యభారము వహించియుండినట్లు తెలుపు చున్నది. విజయనగరసామ్రాజ్యము తాళికోటయుద్ధమునందు (క్రీ.శ.1565) పతనమై తదుపరి క్షీణించుచుఁబోయిన కారణమున మాధవరాయల కడపటిదశలోను యనంతరమును జటప్రోలురాజ్యము ఖుతుబ్‌షాహీల వశమై గోలకొండసామ్రాజ్యము క్రిందికి వచ్చెను. కనుకనే మాధవరాయని యనంతరమున నతనికుమారులకు ‘సుల్తాన్ అబ్దుల్ హసన్ ఖుత్బుషా’(తానీషా) ఈక్రిందివిధముగా ఫర్మానా యిచ్చెను.

‘మీతండ్రి కార్‌కిర్దున నడుచుచున్న సంస్థానములు కదీము జటప్రోలు, వ పూట్ మొఖాసాగ్రామాలు, వ సూగూరు, కొత్త కోట వ దేహాయ నిడివెన్ను