పుట:Chandragupta-Chakravarti.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

చంద్రగుప్త చక్రవర్తి


రైతుల సౌకర్యార్థమయి యొకనదికి యానకట్ట కట్టించి దాని నీటిని యొక తటాకమునకు మరల్చి తప్పని నీటివసతి నేర్పఱిచెననియు తెలియవచ్చుచున్నది.

రాజ్య విభాగము

ఆ దినములలో సాధారణముగ నైదువందల కాఁపు కుటుంబములు గలది యొకపల్లె. ఇట్టిపల్లెలు ఒకదాని కొకటి రమారమి క్రోశెడు దూరమున నుండుచుండెడివి. అందువలన నాపత్సమయమున నొకయూరివారు మఱియొక యూరివారికి సాహాయ్యము చేయఁగలుగు చుండిరి. పొలిమేర విషయమున వివాదము రాకుండుటకయి నదులు పర్వతములు మొదలగు స్వాభావిక చిహ్నములు పొలిమేర గుర్తులుగ నేర్పఱుపఁ బడి యుండెను. పల్లెచుట్టును కలపతో ప్రాకారము పెట్టుచుండిరి. ఇట్టి పల్లెలు అయిదు మొదలు పదింటివఱకు నొక్కయధికారి క్రిందనుండును. ఆ యధికారికి గోపఁడని పేరు. ఈ గోపఁడే ఆ గ్రామములకు సంబంధించిన లెక్కలు వ్రాయుచుండును.గ్రామములు, చేలు, తోటలు, మార్గములు, బీళ్లు, దేవాలయములు, తోఁపులు, తీర్థములు మొదలగువాని సరిహద్దు గుర్తులను ఇతఁడు సంరక్షించువాఁడు.1[1] గ్రామస్థులు చేసికొను దానములు విక్రయములు తనఖాలు ఈతని ద్వారా జరుపు చుండెను. గ్రామములోని ప్రతి గృహము నందలి జనుల యొక్కయు దాసుల యొక్కయు సేవకుల యొక్కయు పశు

  1. 1. ప్రస్తుత మీ పనులన్నియు కరణములు సు ల్యాండురికార్డు ఇన్‌స్పెక్టరు తహశీలుదారులును చేయుచున్నారు.