పుట:Chandragupta-Chakravarti.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

రాజ్యాంగ వ్యవస్థ

చంద్రగుప్తుని కాలమున రాజునకు సలహా నిచ్చుటకు మంత్రి పరిషత్తొకటి కలదు. అందు 12 గురో లేక 18 గురో లేక ఆయా సందర్భములకు వలసినంత మందియో మంత్రులుండెడువారు. అన్నివిషయములలో రాజు వారిని యాలోచన యడుగుచుండెడు వాఁడు. మిక్కిలి రహస్యముగ నుండఁదగిన విషయములలో నొకరిద్దఱు మంత్రులు మాత్రమె యాలోచనఁ దీర్చుచుండిరి. ఎప్పుడైన నొకప్పుడు రాజు స్వతంత్రించి పని చేయుటయుఁ గలదు. కాని సర్వసాధారణముగ మంత్రులలో బహుజన సంఖ్య ఎట్లు చెప్పిన నట్లు నడుచుకొను చుండెడువాఁడు. సామ్రాజ్యము నందలి దూరపు ప్రాంతములపయి చంద్రగుప్త చక్రవర్తి ప్రతినిధుల నేమించి వారివలన రాజ్యకార్యముల నడపించుచుండెను. ఈ ప్రతినిధులు సామాన్యముగ రాజవంశము వారలయినట్టు కానవచ్చుచున్నది. రాజధానికి వేయి మయిళ్ల దూరము నందుండు 'గిర్నారు' అనఁబడు పశ్చిమ ప్రాంతమున పుష్య గుప్తుఁడను ప్రతినిధి పరిపాలించు చుండినట్లును అతఁ డచ్చటి