పుట:Chandragupta-Chakravarti.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

చంద్రగుప్త చక్రవర్తి


ధర్మ యుద్దము

హిందువుల యుద్ధవిధులు ఇతర దేశస్థుల వానికంటె మిగుల కరుణాయత్తములు.

"ఆయుధములు పడవైచినవారిని, జుట్టు విరియంబోసి కొనియో చేతులను జోడించుకొనియో దయవేఁడు వారిని,శరణు జొచ్చినవారిని హింసించఁగూడదని యార్యశాసనము."1[1]

"భీరులతో, మత్తులతో, ఉన్మత్తులతో, మైమఱచిన వారితో, కవచ భ్రష్టులతో, స్త్రీ, శిశు వృద్ధ బ్రాహ్మణులతో, యుద్దము చేయరాదు."2[2]

"సంహృత యోధుల పత్నులకు సంరక్షణ నొసంగ ఫలయు,"3[3]

మెగాస్తనీసు ఇట్టి హిందువుల యుద్ధధర్మకారుణ్యమునకు సాక్ష్యము పలుకుచున్నాఁడు. "ఇతర దేశస్టులలో నుద్ధ కాలములందు భూనాశనము సామాన్యమైయుండఁగ నందునకు మాఱుగ హిందువులలో పంటకాఁపులు-పవిత్రులును సహింసనీయులును గావున-సమీపముననే పోరు చెలరేగుచున్నను భయమించుకయు లేకయే నెమ్మదిగ నుందురు. ఏలయన ఇఱు తెగల పోటరులును పోరుసలుపుచు నొండొరుల నఱకు కొనుచున్నను. సేద్యకాండ్ర జోలి కించుకయుఁ బోక నుందురు. మఱియు పగతుని భూమిని అగ్నిదగ్ధముచేయుట గాని అచ్చటి చెట్లను నఱకివేయుట గాని వారికి వాడుక లేదు.

  1. 1. ఆపస్థంబ. 11 5-10-11
  2. 2. బోధాయన. 1 10-16-11
  3. 3. వసిష్ఠ. XIX 30