పుట:Chandragupta-Chakravarti.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

చంద్రగుప్త చక్రవర్తి


పదుగురిపై యధికారి నాయకుండు నాఁజను. అట్టి నాయకులందఱకును సర్వ సైన్యంబునకును నధికారి యగువాఁడు సేనాముఖ్యుం డనంబడు చుండెను.

స్కంధావారనివేశము

సైన్యము యుద్ధమునకు సన్నద్ధమయి వెడలుటకు మున్నొక నాయకుఁడును నొక ఔ్యతిష్కుండును నొక వర్థకుఁడును, అనఁగా వడ్రంగియు, బెక్కండ్రు కూలివారును బయలు దేరి మార్గములను, అందలి గ్రామములను, అరణ్యములను, వంతెనలను, కాలిత్రోవలను, బావులను, చెఱువులను బరీక్షించి చెడిపోయిన వానిని సంస్కరింపు చుందురు. సైన్యము విడియుటకుఁ దగినస్థలములను నిర్ణయించి వీలుకొలఁది వలయాకారము గలథిగఁగాని చతుష్కోణాకృతి గలదిగాఁ గాని శిబిరంబును నేర్పఱుతురు. శిబిరమునకు నాలుగు ద్వారములును ఆఱుత్రోవలును నుండును. అది తొమ్మిది భాగములుగా విభజింపఁబడును. శత్రువులవలన నపాయము జరుగకుండ దాని చుట్టును కందకములును, గోడలును, పరిధులును, బురుజులును నిర్మింపఁబడును. రాత్రింబవళ్ళు పహరాయిచ్చుటకు పదునెనిమిది జతల సైనికు లుందురు. శిబిరమునం దప్రమత్తత నెలకొనుటకయి ద్యూతము త్రాగుడు విందులు కలహములు పూర్ణముగ నిషేధింపఁ బడియుండెను. శత్రువులు మారు వేషముతో శిబిరముఁ జొరకుండుట కొఱకు అభిజ్ఞానపత్రము (pass-part) పొందనివారు లోనికి రానియ్యఁ బడుచుండ లేదు. 1[1]

  1. 1. చాణక్యుని అర్థశాస్త్రము. 10; 1,