పుట:Chandragupta-Chakravarti.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము

91


వీపుపై నిడికొని శాలకుఁ గొనిపోయి స్నేహితుఁడు పోలె నతని ప్రక్క దుఃఖించుచు నిలుచుండె.1[1]

రథములు

రామాయణ మహాభారతాది కాలమునుండి మనదేశమున మహాయోధులు రధారూఢులయియే యుద్ధము చేయు చున్నట్లు కానవచ్చుచున్నది. సాధారణ సైనికులు మాత్రము నేలపై నిలువంబడి పెనంగుచుండిరి. చంద్రగుప్తుని కాలమున సాధారణముగ నరదంబునకు రెండు గుఱ్ఱములు పూన్చెడువారు. నాలుగు గుఱ్ఱంబుల రథంబులును నుండె. ప్రతి రథంబు మీఁద సారథిగాక ఇద్దఱు రథికులుందురు. కొన్ని రథముల మీఁద నిద్దఱు సారథులును, ఇద్దఱు ధనుర్ధరులును, ఇద్దఱు ఫలకధారులును నుందురు. పనిఁ బడిన వేళల సారథులుగూడ సమరరంగంబున దమ శౌర్యంబు సూపి యని సల్పుచుండిరి. 2[2]

ఇట్టి రథసైన్యంబునకు రథాధ్యక్షుం డను అధికారి యుండెడువాఁడు. యుద్ధంబునకుఁ దగిన రథంబులను సిద్దపఱపించి యుండుట యతనిపని.

నైన్యములోని యధికారుల పరంపర

చతురంగములోని యొక్కొక యంగమునందలి పదుగురు భటులకుఁ బై యధికారి పదికుఁడు. అట్టి పదికులు పదుగురిపై యధికారి సేనాపతి నాఁబరంగు. అట్టి సేనాపతులు

  1. 1. మాక్రిండలు మెగస్తనీసు 118 ప్క్వేజి
  2. 2. కర్టియసు 8. 14