పుట:Chandragupta-Chakravarti.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

చంద్రగుప్త చక్రవర్తి


కలిగి యుద్దములలో సంరక్షించుచుండెను. ఇందును గుఱించి చంద్రగుప్తుని యాస్థానమున గ్రీకువారి ప్రతినిధిగ నుండిన మెగస్తనీ సొక చిత్రమయిన కథ వ్రాసియున్నాఁడు.

ఒకానొక భారతీయునకు తెల్ల ఏనుంగు గున్న యొకటి చిక్కెను. అతఁడు దానిని పెంచుకొని వాహనముగ నుపయోగించుకొనుచుండె. దినదినమునకును దానియెడ నతని కనురాగము హెచ్చుచువచ్చెను. అదియును దన యజమానునికి విశ్వాసము నెఱపుచుండెను. ఇట్లుండ రాజున కద్దానిని అపహరింపవలెనను దురాశ పొడమెను. కాని స్వంతగాని కా జంతువుపై నెక్కుడు ప్రేమయుండుటచేతను ఇతరుల వశమున దాని నుంచుటకు బుద్ధిపుట్టకపోవుట వలనను దానితోడంగూడ దేశము వదలి యడవులకుఁ బారిపోయెను. ఈ వార్త విని రాజు కోపోద్దీపితుఁడయి ఏనుంగును మనుష్యుని బట్టి తెచ్చుటకుఁ దన పరివారము నంపెను. వారును దరలిపోయి ఏనుంగును దాని యజమానుని దాఁకిరి. గజంబుపై నుండి అతఁడు రాజభటులతోఁ బోరాటము సలిపెను. వానికి ఏనుంగుకూడ సాయమొనర్చెను. కాని రాజభటు లనేకు లై నందున వాఁడు గాయములుపడి సోలి క్రిందఁ బడిపోయెను. యుద్దమునందు పడిన భటుని నాతని సహభటులు దమ డాలులతో గప్పుపగిది అప్పుడీ యేనుంగు తన స్వామిని గప్పియుంచి శత్రువులను గొందఱను మడియించి తక్కినవారిం జెల్లాచెదరొనర్చివైచెను. పిదప నాతనిని తన తొండముతో నెత్తి