పుట:Chandragupta-Chakravarti.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము

87


దేశంబుల1[1] నుండి కొనిరాఁబడు చుండెను. ఇందులో కాంభోజ సింధ్వారట్టవ నాయువుల గుజ్జములు శ్రేష్ఠములుగ నెన్నఁబడు చుండెను.

గుఱ్ఱములమీఁది. యధికారికి అశ్వాధ్యక్షుఁడని పేరు. తీక్ష్ణ, భద్ర, మంజాది గుణముల ననుసరించియు వాని జన్మస్థలముల ననుసరించియు గుఱ్ఱముల తరగతుల నేర్పఱచి లెక్కలు వ్రాయించుటయు, వానికి యుద్ధమునందును ఇతర సమయము లందును బనికివచ్చు నానాగతులను2[2] నేర్పుటయు విశాలమయిన అశ్వశాలలను నిర్మించుటయు, అశ్వచికిత్సకుల నేర్పఱిచి వారిచేఁ బనులు గొనుటయు మఱి యితర విధముల నశ్వముల పోషించి కాపాడుటయు నీయధ్యక్షునికిఁ గర్తవ్యములయియుండెను. అశ్వముల కుపచారములు చేయుట కీ క్రింది క్షుద్రసేవకులు నియమింపఁబడి యుండిరి.

1. సూత్రగ్రాహకుఁడు -నఫరుపని చేయువాఁడు

2. అశ్వబంధకుఁడు - గుఱ్ఱములను గట్టివేయువాఁడు

3. యావశికుఁడు - తృణమును కొని తెచ్చువాఁడు

4. విధాపాచకుఁడు - గుఱ్ఱములకుఁ బెట్టు నిమిత్తమయి గుగ్గిళ్ళు మొదలగు వానిని వండువాఁడు

  1. 1. కాంభోజమనఁగా ఆఫ్ఘనిస్థానము, సింధువుమన మెఱింగినదియే. ఆరట్టు పంజాబునందలి అరాష్ట్రకుల దేశము వనాయు వనఁగా ఆరబ్బీదేశము. బాహ్లికమనగా మధ్య ఆసియా యందలి బాల్ట్ దేశము, సౌవీరమనగా గుజరాతుదేశమందలి ఈడరురాష్ట్రము. పాపేయ తైతల దేశంబు లెవ్వియో కనుంగొనవలసి యున్నది.
  2. 2. యుద్ధ సమయమునందలి గతులకు “ఔపవాహ్యక " గతులనియు శాంత సమయములందుచేయు స్వారిసంబంధమగు గతులకు “సన్నాహ్య" గతులనియు పేళ్లు