పుట:Chandragupta-Chakravarti.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము

7


ఇఁక మగధదేశపు రాజులనుగుఱించి విచారింతము.

మహాభారతకాలమునం దచ్చట జరాసంధుఁడను రాజు రాజ్యము చేయుచుండెను. అతఁడు మిక్కిలి పరాక్రమవంతుఁడు. ఆతని దాడికి ఓర్వలేక యాదవులు మధురానగరము విడిచి పాఱిపోయి ద్వారకలో నివసించిరి. అతఁడు పెక్కండ్రులగు రాజులను బట్టితెచ్చి తన చెఱసాలలో నుంచెనని మహాభారతమునందు వర్ణింపఁబడు యుండుటఁ జూడ నతఁడసామాన్య పరాక్రమశాలి యనియుఁ, బెక్కురాజులు తన్ను బలిసికొలువఁ బ్రభుత్వము చేయుచున్న చక్రవర్తియనియుఁ దోఁచుచున్నది. ధర్మనందనుఁడు రాజసూయ యజ్ఞముఁ సేయ నుద్యమించినప్పుడు కృష్ణ భీమార్జునులు గిరివ్రజమునకు బ్రాహ్మణులవలెఁ బోయి జరాసంధుని వధించి యతని చెఱసాలలోనున్న నసంఖ్యులగు మూర్ధాభిషిక్తుల విడిపించి, యతని పుత్త్రుఁడగు సహదేవునకే పట్టాభిషేకముచేసిన సమాచారము మహాభారతముఁ జదివినవా రందఱకును దెలిసిన విషయమే.

మహాభారత యుద్ధమునం దీ సహదేవుఁడు పాండవపక్షమునం బోరాడి హతుఁడయ్యెను. అతని వంశపువారగు నిరువదియొక్కరు రాజులు తరువాత రాజ్యము చేసిరి. చివరవాఁడు పురంజీవుఁ డను నామాంతరము గల రిపుంజయుఁడు. వీరందఱును గలసి వేయిసంవత్సరముల వఱకు రాజ్యముచేసిరని పురాణమువలనఁ దెలియ వచ్చుచున్నది. పురంజయునిమంత్రియగు శునకుఁడు తన రాజును జంపి తన కుమారుఁ డయిన