పుట:Chandragupta-Chakravarti.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

చంద్రగుప్త చక్రవర్తి


యుద్యోగస్థులప్పుడు చేయుచుండిరి. రెండవ పంచాయితీ దార్లు పాటలీపుత్రమునకు వచ్చెడి యన్యదేశీయులఁ గాపాడుచుండిరి. అన్యదేశీయులు రాజ్యము గుట్టు కనుఁగొనవచ్చిన మోసకాండ్రో లేక నిజముగా నేదో యన్య కార్యముమీఁద వచ్చిన వారలో కనుఁగొనుట, అన్య కార్యముమీఁద వచ్చిన వారిని గౌరవించుట, వారికి నేమియు నిబ్బంది లేకుండఁ గాపాడుట, వారికిఁ గావలయు భోజన పదార్థము లిప్పించుట, జబ్బుగానున్న వారికి ఔషధము నొసంగుట, మృతిఁజెందిన వారికి నంత్య సంస్కార్యములు చేయించి వారిసొత్తేమైన నున్న యెడల వారి వారసులకు బంపుట, వీరి పనులయి యుండెను. ఇందువలన నా కాలమందు ననేక పరదేశీయులు మనదేశమునకు వచ్చుచుండి రనియు చంద్రప్తునకు సనేక పరరాజులు స్నేహితులుగానుండి రనియుఁ గానవచ్చుచున్నది. మూఁడవ పంచాయితీ దారులు గ్రామములోని జననమరణపు లెక్కను జూచుచుండిరి. నాగరికతఁ జెందినయింగ్లీషు దొరతనమువారుకూడా మొన్న మొన్నటివఱకు నీదేశంబున జననమరణపు లెక్కఁ బ్రారంభింపలేదు. ప్రారంభించి కొద్దికాలమే యాయెను. ఇట్టి స్థితిలో రెండు వేవేండ్ల క్రిందఁ జంద్రగుప్తుడు ప్రజా క్షేమము తెలియుకొఱకును, పన్ను కట్టుటకు వీలుగ నుండుకొఱకును ఈ లెక్కల వ్రాయించుట చూడ నతని బుద్ధివైభవమునకు నెవ్వరాశ్చర్య పడకుందురు ? నాల్గవ పంచాయితీదార్లు వాణిజ్యాధికారము గలవారయి యుండిరి. తూనికెలు, కొల్తలు తప్పువి కాకుండను, అమ్మెడి వస్తువులలో మోసము లేకుండను జూచుట వీరిపని. అయిదవ పంచాయితీ