పుట:Chandragupta-Chakravarti.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10]

ఆఱవ ప్రకరణము

73


నకు మార్చెను. ఇట్లు పర్వత ప్రాంతములో నున్న రాజ గృహమునుండి ఏటియొడ్డున నున్న పాటలిపుత్రమునకు రాజధానిని మార్చుటకుఁ గారణము లేకపోలేదు. మగధరాజ్యము దినదినాభివృద్ధి నొందుచుండెను. రాజ్యము యొక్క యన్ని భాగములను స్వాధీనమం దుంచుకొనుటకును, హిందూదేశ మందలి వర్తకము నంతయును ఆకర్షించుటకును గంగా, శోణ, గోగ్రా మొదలయిన నదుల సంగమమునకు సమీపమునందున్న పాటలిపుత్రము మిక్కిలి తగినదియని నిశ్చయింపఁబడెను. ఉదయనుఁడు శిశునాగ వంశపురాజు. క్రీ. పూ. 371 వ ప్రాంతమున ఈ వంశమంతరించి మగధము నందుల స్వాధీనమయ్యెను. వారిని వోడించి మన చరిత్రనాయకుఁడగు చంద్రగుప్తుడు కీ. పూ. 321 వ ప్రాంతమున మగధాధీశ్వరుం డయ్యెనని యిదివఱకే వ్రాసియున్నారము.

చంద్రగుప్తునికాలపు పాటలీపుత్రము

క్రీ. పూ. 303 వ సంవత్సరము నందుఁ జంద్రగుప్తుడు సెల్యూకస్ అను గ్రీకురాజు నోడించి యతనితో సంధి చేసి కొనెనని యిదివఱకే వ్రాసియున్నాము. ఆ గ్రీకురాజు మెగస్తనీస్ అనువానిని పాటలి పుత్రమందు జంద్రగుప్తునియొద్ద రాయబారిగ నుంచెను. ( క్రీ. పూ. 302) ఇతఁడు కొన్ని సంవత్సరములవఱకు ఈ పట్టణమునందుఁ గాపురముండి యా గ్రామమును గుఱించియు, ఈ దేశమును గుఱించియు విశేషము లనేకములు , వ్రాసియుంచినాఁడు. ఆ కాలమునాఁటి చరిత్రాంశములు