పుట:Chandragupta-Chakravarti.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

చంద్రగుప్త చక్రవర్తి

ఇప్పుడు పాట్నా నగరమునందు చిన్న పట్న దేవి, పెద్ద పట్న దేవి యను దేవాలయములు రెండు గలవు. వానిలో నర్చకులుగా నుండువా రిట్లు చెప్పెదరు. సుదర్శనుఁడను రాజునకు పాటలి యను కూఁతురు గలదు. ఆమెచే నీ పట్టణము కట్టింపఁ బడియెను. ఈమె కాతఁడు బహుమతిగ నీ పట్న మొసంగగ, దీనిని పుత్రవాత్సల్యముతో తల్లింబోలె సంరక్షించి నందున పాటలిపుత్రమని పేరుగల్గెనఁట.

పుత్రకుఁడు అను రాజకుమారుఁడు మంత్రదండ మహిమచే నిర్మించెననియు నతని భార్యపేరు పాటలి. కావున దీనికి పాటలిపుత్రమని పేరుఁ బెట్టెననియు కథా సరిత్సాగరము నందును హ్యూన్ ట్సాంగుని యాత్రా చరిత్రమునందు వ్రాయఁబడియున్నది. డియోడొరసు అను గ్రీకు చరిత్రకారుఁడు హెరక్ల్‌స్ (Herakles) అనఁగా బలరామునిచే నిది ప్రతిష్ఠింప బడియెనని తాను వినినట్లుగా దెల్పియున్నాఁడు. వాయు పురాణమును సూత్తపిటకమును శిశునాగవంశస్థుడు ఉదేయుడు దీనిని కట్టించినట్లు తెల్పుచున్నవి.

మేజరు విల్ఫోర్డు పాటలీపుత్రమును పద్మావతియనియు మహాబలిపురమనియు పేళ్ళు గలవనియు, ఈ పేళ్ళు గల్గుటకు కారణము, మహాబలియనియు మహాపద్ముఁడనియు దానిని బ్రతిష్టించిన రాజు పేళ్ళగుట యనియు వివరించుచున్నాడు. అట్టి నందుని పట్టణము కావున బలిపుత్ర యనియు పాలిబోత్ర యనియుఁ బేళ్ళనొంది. గ్రీకుల చెవుల కందెననియు నుడువు