పుట:Chandragupta-Chakravarti.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

67


శాఖోపశాఖలనో ఆశ్రయించి యున్నవి. ఇందు పాటలీపుత్రము నిర్మింపఁబడిన స్థలము కంఠసరములను గూర్చిన పతకమువలె అనేక నదుల సంగమమునకు సమీపమున నుండుటఁబట్టి అలంకారముగను, బలప్రదముగను, వ్యాపారానుకూలతంబట్టి ధనప్రదముగను నుండెను. కనుకనే ఇది వేయునెక్కు వేండ్ల కాలము హిందూస్థానవు బలిష్ఠ రాజధానిగా విరాజిల్లుచుండెను.

నామోత్పత్తి

పాటలీపుత్రమన్న పేరుగల్లుట కనేకు లనేక హేతువులు చెప్పుచున్నారు. పాటలీయన నొక పుష్పవిశేషము. దీనిని దెలుఁగులో కలిగొట్టు పువ్వందురు. ఈ పువ్వును బోలి ఆ పురియొక్క యాకారముండెననియు, అందుచే నా పేరు వచ్చెననియు కొందఱి యభిప్రాయము. ఆ పట్టణమందును, సమంత ప్రాంత మందును పాటలీ వృక్షములును, పుష్పములును మెండుగ నున్నందున ఈ నామము కల్గెనని కొందఱందురు. శ్రీరామ లక్ష్మణులు సరయూగంగా సంగమమునకు పైని సరయును దాఁటి దక్షిణతీరము చేరఁగనే వారికి పాటలాది వృక్ష సంకీర్ణమైన వనము కానవచ్చినట్లు శ్రీమద్రామాయణము నందు వర్ణింపఁబడినది.*[1] కావున మిక్కిలి ప్రాచీన కాలము నుండి మగధదేశముయొక్క యీభాగము పాటలిపుష్పమునకై ప్రసిద్ధి వహించినట్లు కానవచ్చెడిని.

  1. *వాల్మీకి రామాయణము, బాలకాండము, 24 వ సర్గము.