పుట:Chandragupta-Chakravarti.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ ప్రకరణము

61


యోకునితాత. మనుమలు సమకాలికులైనప్పుడు వారితాతలు గూడ సమకాలికులగుట సహజమని సాధారణముగ గ్రహింపవచ్చును. కావున సెల్యూకస్ నికేతర్ చంద్రగుప్త మౌర్యునకు సమకాలికుఁడనుట స్పష్టము.

పైని వ్రాయఁబడిన హేతువులచే మనచరిత్ర నాయకుండగు చంద్రగుప్త మౌర్యుఁడు అలెగ్జాండరు. తోడను సెల్యూకస్ నికేతర్ తోడను సమకాలీనుఁడు అని తేలినది. గ్రీకు వారగు వీరిద్దఱి చరిత్రలును సమకాలికులైన గ్రంథకారులచే వాయఁబడి యున్నందున వారి కాలము నిశ్చితము. వారి యుద్ధములను గుఱించియు దాడులను గుణించియు ప్రవాసములను గుఱించియు చేయఁబడిన కాలనిర్ణయములలో ఒకటిరెండు నెలల విభేదము వచ్చినను రావచ్చును. కాని అంతకంటే నెక్కుడు ఎచ్చు తక్కువ లుండవు.

అలెగ్జాండరు హిందూదేశమునకు వచ్చినప్పుడు చంద్రగుప్తుడు ఆతనిని సందర్శించి నట్టున్నది. గావున ఈ ప్రసంగము క్రీ.పూ. 325 లోనో 326 లోనో జరిగియుండవలెను. అలెగ్జాండరు క్రీ.పూ. 325 వ సంవత్సరమందు మే నెలలోనో జూన్ నెలలోనో కీర్తి శేషుఁడయ్యెను. అతని మరణవార్త తెలిసిన కొలఁది కాలమునకే చంద్రగుప్తుడు స్వతంత్రుఁ డయ్యెనని వ్రాయఁబడి యున్నది. అలెగ్జాండరుని మరణవార్త హిందూదేశ జనులకుఁ తెలియుటకు రెండు నెలలు పట్టినదనుకొన్నను ఆగష్టు నెలలోనో లేక సెప్టెంబరు నెలలోనో యీ వార్త తెలిసియుండును. ఆతఁడు. వెంటనే సైన్యములను కూర్చుకొని