పుట:Chandragupta-Chakravarti.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

చంద్రగుప్త చక్రవర్తి


దొంగలును దోపిడికాండ్రును అని భారతమునందు దూషింపఁ బడియున్నారు. కతేయులు నటులనే దూషింపఁబడియున్నారు. కాని ఈ అరాట్టుల సీమలు ప్రజాసభ పాలితములై, రాజుల కధికారమియ్యక స్వతంత్రజనపూరితముగ నున్నట్లు తోఁచెడిని.

మహమ్మదీయ చరిత్రమునందు అక్బరు చెల్లాచెదరుగ నున్న దేశభాగములనెల్ల తన యాజ్ఞయం దిమిడ్చికొని చక్రవర్తిత్వఁ బడసినట్లు అతనికి 1900 సంవత్సరములకు మునుపు చంద్రగుప్తుఁడు చెల్లాచెదరుగనున్న సామంత ప్రభుత్వముల నెల్ల ఏకాజ్ఞాచక్రమునకు వశపజచుకొని మగధాధీశుఁడాయె ననవచ్చును.

చంద్రగుప్తుఁ డిట్లు గ్రీకు వారిని వెడలఁగొట్టి, పంజూబు దేశమంతయు నాక్రమించుకొని, నందుల నోడించి, మగధరాజ్యము సంపాదించి, హిందూదేశమున కంతకును దానుయేక చ్ఛత్రాధిపతిగ నుండఁదలఁచి సైన్యముల మిక్కిలి యభివృద్ధి చేసెను. అతనియొద్ద నాఱు లక్షల కాల్బలమును, ముప్పదివేల స్వారులును, తొమ్మిదివేల గజంబులును నుండెను, ఈప్రచండ సైన్యంబుతో నాతఁడుత్తర హిందూ దేశ మందలి యన్ని రాజ్యములను గెలిచి, నర్మదా హిమాలయములు దక్షిణోత్తరపు టెల్లలుగను బూర్వపశ్చిమ సముద్రంబు లాయా దిక్కుల యెల్లలుగను గల యార్యావర్తంబున కంతటికిని ప్రథమ చక్రవర్తి యయ్యెను.