పుట:Chandragupta-Chakravarti.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము

43


లను, చూచిన చంద్రగుప్తుని కనులకు అలెగ్జాండరుని 50,000 సైన్యమును పేదఱికమును చులకనయై తోఁచెనో ? అలెగ్జాండరు చంద్రగుప్తుల పరస్పర మర్యాదోపచారములలో హెచ్చు తక్కువలు కానిపించెనో ? గాంగేయసీమకు రాక స్వదేశ ప్రయాణోన్ముఖుఁడైన గ్రీకు వీరునిజూచి మౌర్యుఁడు పరిహసించెనో ? సాయమిచ్చి గాంగేయ భూమిని బొసఁగ గూర్చిన యెడ, తనకు భవ్యతం జూపమని తెల్పిన మౌర్యునిపై నలెగ్జాండరు కిని సెనో ? సామాన్య సంభాషణయందే చంద్రగుప్తుని స్వసామ్యతాగౌరవ భావంబుల కలెగ్జాండ రోర్వక పోయెనో ? "చింత్యము.

చంద్రగుప్తుఁడు స్వతంత్రుఁడగుట

పైని వర్ణించినట్లు గ్రీసు దేశీయుఁడగు నలెగ్జాండరు పంజాబు దేశంబునఁ గొంత రాజ్యము సంపాదించి, వాని రక్షణార్థమై కొందఱ సైనికుల నటనట నునిచి వెడలినతరువాత వారిని వెడలిగొట్టి యా రాజ్యమును దా నాక్రమించు కొన వలెనని చంద్రగుప్తుఁడు ప్రయత్నములు చేయఁ దొడగెను.

మహావీరుడగు నీతఁడు సమయమునుకనిపట్టి వాయువ్య ప్రాంతమందలి యుద్ధప్రియులగు భటులను నరాట్టులను గూర్చుకొని శేషించిన గ్రీకుదళముల విదళీకరించి సైన్యబలమును నానాఁటికి వృద్ధిజేసికొని ప్రాంతసీమల కెల్ల నధికారియాయెను. (క్రీ.పూ. 322) అరాట్టులు, *[1] అనఁగ, పంజాబు నివాసులును

  1. *అరాట్టులు, అరాష్ట్రులు అను పదములకు గ్రీకు చారిత్రకులును చోరార్థమునం దుపయోగించి యున్నారు.