పుట:Chandragupta-Chakravarti.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము

39


వ్యాపించియుండు భూభాగమునకు అతి ప్రాచీన కాలమునందు, ఐరాను అనగ ఆర్యావర్తమని పేరు. ఇందున్నవారికి ఆర్యులని పేరు. ఈ ఆర్యులే క్రమముగా ప్రజాధనబలముల, ప్రబలించి నానా దిగ్దేశములను వ్యాపించి, నేఁటికిని పృథివీతలవాసులలో నత్యంత బుద్ది భుజబలాఢ్యులై విలసిల్లుచున్నారు. అగుంగాక . మనము ప్రస్తుతమనుసరింతము.

గ్రీకు దేశమునకు హిందూదేశమందలి సింధూనదమునకును అంతరము రమారమి నాలుగు వేల మైళ్లుండును. గ్రీసు దేశస్థులను గ్రీకువారని పిలిచెదరు. వీరిని మన పూర్వులు మేచ్ఛులనియు యవనులనియు వాడియున్నారు. ఈ పదములకు చదువరులు మహమ్మదీయులని యర్థము చేయగూడదు. ఏలయన మేమిప్పుడు వ్రాయుచున్నకథ మహమ్మదు పుట్టుటకు పూర్వము జరిగినది. ఈ వృత్తాంతము జరిగిన తరువాత 900 సంవత్సరములకు మహమ్మదు పుట్టెను. గ్రీకువారు మహా బలాఢ్యులు. మగధదేశముపై నందులు రాజ్యము చేయుచున్నప్పుడు గ్రీసుదేశము దన సామ్రాజ్యములఁ జేర్చుకొని యుండిన మకడోనియాలో ఆలెగ్జాండరను నొక మహావీరుఁడు క్రీ. పూ. 356 వ సంవత్సరమందు జన్మించెను.

అలెగ్జాండరు దండయాత్ర

ఇతఁడు పెక్కు దేశములు జయించి పారసీకదేశమును స్వాధీనపఱచుకొనిన తరువాత హిందూదేశము మీఁదికి దండెత్తి వచ్చెను. ఈతఁడు క్రీ. పూ. 327 వ . సంవత్సరము