పుట:Chandragupta-Chakravarti.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5]

మూఁడవ ప్రకరణము

33


నగరు వదలి పర్వత రాజ్యమునకు నడచెను. నడచిపోయి మలయకేతువు నాశ్రయించి తన నందభక్తియు మృతనంద తర్పణ ప్రతిజ్ఞయు విప్పి చెప్పెను. పర్వతేశ్వరునకు ఉచిత తర్పణము శత్రుసంహార రూపమున మలయకేతువు ఆచరింప వలసిన యగత్యమును గట్టిగ బోధించెను. రాక్షసునివంటి యమాత్య శ్రేష్ఠుఁడు తోడై యుండఁదనకు తప్పక జయము కలుగునని నిశ్చయించి అతఁడు తన సైన్యముల నెల్ల సన్నద్ధ పఱచి యుద్ధమునకు బయలుదేరెను. అతనికి కశ గాంధార యవనక శచీన పూణకౌలూతాది రాజులు తోడ్పడిరి.

చాణక్య ప్రయత్నములు

చాణక్యుఁ డీవినోదములను చూచుచు నూరకుండెనా? లేదు లేదు. రాక్షసుని ప్రయత్నముల నన్నిటిని జారులచేఁ దెలిసికొనుచు నాతని మాయోపాయముల కన్నిటికిని ప్రతి మాయోపాయములు పన్నుచు చంద్రగుప్తునకు నెట్టి యాపద రాకుండఁ గాపాడుచుండెను. తనకు పరమమిత్రుఁడగు పర్వతరాజు ఘాతమునకై రాక్షసుని పనుపున విషకన్యను దోడ్కొని పోయెనని నేరము మోపి జీవసిద్ధిని గ్రామమునుండి వెడలఁ గొటైను. ఇందుమూలమునఁ దిరిగియు రాక్షసా శ్రయము జీవసిద్ధి కనుకూలించినట్లును, ఇట్టి యనుకూలమున చంద్రగుప్తుని పరమున వేగు చూచుటకును, రాక్షస మలయ కేతువులకు వైరము కల్పించుటకును, జీవసిద్దికి సందుదొరికెను. మఱియు