పుట:Chandragupta-Chakravarti.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

చంద్రగుప్త చక్రవర్తి


రాజభవనపు పూర్వద్వారమును కనకతోరణాదులతో నలంకరించి అందు యంత్రమును నిలిపి దానిని చంద్రగుప్తుఁడు ప్రవేశించునపుడు సడలించి వాని తలపైఁ ద్రోయించి చంప నియమించెను. పట్టపుటేనుఁగు మావటికాని బర్బరకునిపిలిచి సవారిని మంచి యదనుజూచి కనకదండికలో దాఁచిన కత్తిని డుస్సి వెనుక నుండు చంద్రగుప్తుని పొడిచి చంపుమనియెను. రాజ వైద్తుఁడౌ అభయదత్తుని రప్పించి యోగచూర్ణము గలిపిన యోషధముతో చంద్రగుప్త మరణమును సంపాదించుమని ప్రేరేపించెను. రాజ శయనాధికారియగు ప్రమోదకుని బంచి చంద్రగుప్తుఁడు మై మఱచి నిదురించుతఱిని సానకత్తితో సంహరించు మనియెను. రాజగృహముయొక్క అంతర్భిత్తి సురంగమునందు బీభత్సకాది ఘాతుక సమూహమును వేచియుండ నేర్పఱచి శయనమందు చంద్రగుప్తుని బ్రహరింపింప దిట్టముచేసెను. ఈప్రకారము రాక్షసుఁడిన్ని సందిగ్ధసమయములందు చంద్రగుప్త సంహారమునకై యతిచతురతరోపాయములఁ బన్నినను నందొక్కండైన నతనికి సుఫలప్రదంబు గాక పోయెను.

సర్వార్ధసిద్ధి తపోవనం బరిగినది విని చాణక్యుడు నమ్మకమైన ఘాతుకులఁ బనిచి యతని శిరము దునిమించెను. ఇట్లు విషకన్యక మూలమున బర్వతరాజ మరణమును, చాణక్య ప్రయత్నమున సర్వార్ధసిద్ధి మరణమును విని, రాక్షసుఁడు తనకిఁకఁ బాటలియందు నిలుకడ తగదనియెంచి సురంగమార్గమున