పుట:Chandragupta-Chakravarti.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూఁడవ ప్రకరణము

31


చాణక్యునిచేఁ జంపింపబడుననియుచెప్పి చంద్రగుప్తచాణక్యుల మీఁద దనకు భక్తిలేనందున మలయకేతువునే యాశ్రయించి మనుదమని నిశ్చయించి వచ్చినట్లు దెలిపి, యతని యెడ గొలు వమరియుండి చంద్రగుప్త పరమున మలయకేతువును వంచించెను. మలయకేతువు ఆమాటలనమ్మెను. భాగురాయణుండును అత్తెఱంగుననే సలుపుచు మలయకేతువును తోడ్కొని పర్వతరాజ్యంబుఁజేరి యతని కమాత్యుఁడుగ నమరియుండెను.

రాక్షసుని మాయోపాయములు

ఇట్లు పర్వతకుఁడు చచ్చిపోవ, మలయకేతువు పాఱిపోవ, చాణక్య చంద్రగుప్తులు పాటలీపురియందు జయఘోషముతోఁ బ్రవేశించిరి. రాక్షసుఁడు నందున కీయకొనన ట్లభినయించుచుఁ బ్రవేశించిన సైన్యములపై తన సైన్యములద్రోలి పెక్కు శత్రువుల సంహరించెను. నందపక్షమే జయించినట్లు జయఘోషములఁ జేయించి చంద్రగుప్త పట్టాభిషేకమునాటంక పఱచెను. సర్వార్థసిద్ధిని భద్రపఱచిన యెడల స్వీకారపుత్రుని ద్వారా నందవంశమును నిలుపవచ్చునని, అతని సురంగమార్గమున నగరునుండి వెడలిపోయి తపోవనంబున నుండుమని వేఁడి పంపెను. తనకు అత్యంత ప్రాణసఖుండగు చందనదాసుని వశమున గర్భిణియగు స్వపత్నిని పుత్రసమేతముగ నిలిపి కాపాడుమనియెను. తనకార్యస్థుని శకటదాసునివశమున రహస్యములగు ధనకోశముల నప్పగించి నందపక్షబలంబునకై యుక్తరీతినెల్ల వ్యయంబు సేయఁబనిచెను. సూత్రధారదారువర్మను పిలిచి