పుట:Chandragupta-Chakravarti.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

చంద్రగుప్త చక్రవర్తి


చుచు నధికమాత్రల పర్యంతము జీర్ణమగునట్లుగా విసము మెసవించు చుండెను. ఈ చిన్న దిపుడు నవ యువతిగను జగన్మోహనాంగిగను నుండె, జీవసిద్ధియను పేరఁబరంగుచు తనయొద్ద నాశ్రితుఁడుగ, విశ్వాస పాత్రుఁడుగ, దైవజ్ఞసూత్రుడుఁగనున్న క్షపణక వేషధారి నిందుశర్మను బిలిచి యతనిని బలువిధములఁ బొగడి యొక సందేశమునకు నియ్యకొలిపి విషకన్యక నొప్పగించి చంద్రగుప్తునకుఁ దన క్షమార్పణాస్వాగత సూచకమగు కానుకగా నా చిన్న దానిని జేర్చుమని వేడెను. అట్టి సందేశ సమర్పణములతో నా జీవసిద్ధి చాణక్య సన్నిధిఁ జేర నితఁడును రాక్షసాపేక్ష నూహించి చంద్రగుప్తునకు పర స్త్రీ కాంక్ష లేమిని దెలిపి పర్వతేశ్వరుని సంశ్లేషంబునకు కొనిపోవునట్టి యుపాయమును చేయింప, బుద్ధిహీనుఁడును కామా తురుఁడును నగు నాపర్వతేశుడు ఆకన్యకను స్వీకరించి విషస్ప్రష్టుఁడై మృతినొందెను. ఇట్లు చాణక్యుడీ యుక్తివలనఁ జంద్రగుప్తుని ప్రాణములను దక్కించుటయే కాక నందరాజ్యములో భాగమడుగకుండఁ బర్వతేశ్వరునిఁ గూడ సంహరించెను.

భాగురాయణుఁడు

పర్వతరాజు కొమారునిపేరు మలయకేతువు. తండ్రి మరణముచే భీతిఁబడుచున్న మలయకేతువు నొద్దకు సేనాపతి భాగురాయణుడువచ్చి పర్వతేంద్రుఁడు చాణక్యునిచేఁ జంపింపఁ బడెననియు మలయకేతువు తక్షణమే స్వదేశమునకుఁ బారి పోవని యెడల వాఁడు గూఁడ అర్ధరాజ్యమెగఁగొట్టఁ దలఁచిన