పుట:Chandragupta-Chakravarti.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూఁడవ ప్రకరణము

29


లేనందున, అట్టి అమానుష ప్రజ్ఞా శౌర్యములకు రాక్షసుఁడని బిరుదుఁ బడసియుండెను. స్వామిభక్తి పరాయణుఁడగు నీతఁడు తన యనుపమేయ సాహసంబుతో పగతురు సైన్యములఁ బలు సోలించి కూలించి నందుల శ్లాఘనను బడసెను గాని నంద నాశ, వృత్తాంతము సేనలయందుఁ బర్వఁగనే పర్వతరాజు బలముల కుత్సాహాధిక్యమును పాటలీబలములకు దైన్యాధిక్యమును రాక్షసునకు శోకవిహ్వలతయు నుప్పతిల్లె.

నందసంహార మయినను మంత్రి రాక్షసుని ప్రతిభా విశేషమునకును స్వామిభక్తికిని వెఱచి చంద్రగుప్తుఁడు పాటలీ నగరమునఁ బ్రవేశించినవాఁడు కాఁడు. మఱియు చాణక్యుఁడు తన రెండవ పంతమగు చంద్రగుప్త పట్టాభిషేకమును జెల్లించుట కుపాయముల నాలోచించుచు పాటలీ బ్రవేశ ప్రయత్నమందు నుద్యుక్తుఁ డయ్యెను. కావున జయరాత్రిని పర్వతు బలములు పురికి దూరమున శిబిరములయందు విడిసియుండెను.

విష కన్యక

ఇంతలో రాక్షసుఁడు నందుల కుచితమైన తర్పణము చాణక్య చంద్రగుప్త పర్వతేశ్వరాదుల సంహారమె యని నిశ్చయించుకొని, అది ముగించుటకు యుద్ధోపాయ మక్కరకు రానందునఁ దగిన మాయోపాయములను తన యావచ్ఛక్తితో బన్నెను. అందు మొదటిది విషకన్యా ప్రయోగము. చిఱుత ప్రాయమునుండి యొక యాఁడుపిల్లను రాక్షసుఁడు సాఁకుచు వచ్చెను. దీనికిఁ గ్రమక్రమముగ నల్పమాత్రలనుండి యెక్కిం