పుట:Chandragupta-Chakravarti.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

చంద్రగుప్త చక్రవర్తి


కాని చాణక్యుఁడు గడుసరికావున అతని యాలోచనల నూహించుకొని అతని సంశయములు నశించునట్లు దగినట్టి మంత్ర తంత్రములఁ బన్ని యతని మెప్పించి నందరాజ్యమునం దర్ధభాగము నిప్పించునట్లుగా నొప్పందము సేయించి యెట్టకేల కతని సాహాయ్యమును బడసెను. పర్వతరాజు వెంట నతని సహాయులుగ శక, యవన, కిరాత, కాంభోజ, పారసీక, బాహ్లిక రాజ ప్రభృతులును లేచివచ్చిరి. ఇట్లు ప్రాంతసీమలనుండి దాడి వెడలివచ్చిన మ్లేచ్ఛబలములు బహుసంఖ్యాతములును శౌర్య వీర్య వైర సంయుతములు నైనవి.

చాణక్య చంద్రగుప్తుల యాలోచన మూలమున, మ్లేచ్ఛబలములు రెండు భాగములుగ వీడి, పూర్వభాగము గండకీ ప్రాంతముచేరి పాటలిని ముట్టడింపఁబోవ పర్వతరాజుచే నడపఁబడిన మూలబలము గంగా శోణాసంగమము వైపు నడచెను. నందులు తమ సైన్యముల నడపుకొని సరయూసంగమున శత్రువునకై వేచియుండఁగా, ఇందుశర్మ తంత్రములఁ బన్ని నందుల విడఁదీసి చాణక్యుని వలయందుఁ జిక్కించెను. అంత నితఁడు వీరి నందఱను సంహరింపించి మొదటి ప్రతిజ్ఞను నెరవేర్చుకొనెను.

మంత్రి రాక్షసుఁడు

నందమంత్రులలో ప్రముఖుఁడును ప్రచండధీబలదోద్బలములు గలవాఁడు నొకడుండెను. ఇతనిపేరు రాక్షసుఁడు రాజ్య నిర్వహణమునందు మనుష్యులలో నితనికి సమాను డక్కాలమున