పుట:Chandragupta-Chakravarti.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

చంద్రగుప్త చక్రవర్తి


యున్న జనులలో గొందఱును బ్రాహ్మణోదాసీనము కూడదని బోధించినను నా మాటలు వా రాలకింపక యతనిని గర్విష్టునిగా భావించి బంటులఁ బనిచి యా యాసనమునుండి లాగివేయించిరి. అంత నా చాణక్యుని జుట్టు వీడిపోయెను. కండ్లెఱ్ఱనాయెను. ఒడలు వడకెను.. పెదవిని కొఱికికొని యెగిరిపడుచు నచ్చటి జనులందఱు వినునట్లు గొప్పపంత మొకటిపట్టెను. చాణక్య శపథమేమనిన, "నన్నిట్లగ్రాసనము నుండి లాగి బహుజన సమూహమున నవమాన పఱచిన యో నందాధములారా! ఇట్లనే మిమ్ములను మీ సీంహాసనము నుండి లాగించి మీశిరముల నెల్లదునిమి, యటుపిదపనే యీజుట్టును ముడిచెద ! నా చాతుర్య సామర్థ్యములఁ జూతురుగాక!" అని ధిక్కరించుచు కాలరుద్రునివలె గర్జించిన యా బాహ్మణుని కోపానలమును జల్లార్చుటకై నందు లేవిధమైన శాంతివచనముల నైన నాడక పోయిరి. అయ్యోపాపము! బ్రాహ్మణ ద్వేషము సామాన్యమా? అద్దాని ఫలమును నందులు త్వరలోనే అనుభవింప వలసి వచ్చెను.

చాణక్యుని యాగ్రహాదుల చంద్రగుప్తుఁడు చూడఁ గలిగెను, ఆట్లు బ్రతినపట్టి యరుగుదెంచుచున్న యా బాహ్మణుని వెంబడించి నడచివచ్చుచున్న చంద్రగుప్తుడు, వెనుక చూచుడు నతని కనులఁ బడియెను. అంత జంద్రగుప్తుడు సాగిపడి నమస్కరించెను. అతడును నితని లేవనెత్తి కుశలప్రశ్నము వేయ నతనితో చంద్రగుప్తుడు తనకును నందులకును గల