పుట:Chandragupta-Chakravarti.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

చంద్రగుప్త చక్రవర్తి


కాని కొందఱు వాదించు, విధంబున నితఁడు గపటికాఁడు. భాషలు దెలియమిం జేసియు, హైందవపద్ధతులను గ్రీకు అనుభవములతో విమర్శించుటం జేసియుఁ గొన్ని లోపములు గల్గిన వనుట సమంజసము. ఇంతియగాక ఇతని సంపూర్ణగ్రంథము లేని దీతని దూర నేరికి దరంబు? తరంబైనను అదెట్టి న్యాయంబు? తెలిసినది తెలిసినవఱకు దేశమును గుఱించియు, భూస్థితిని గుఱించియు, శీతోష్ణస్థితిగతులను గుఱించియు, పశుపక్ష్యాదులను గుఱించియు, జాతిమతములను గుఱించియు, ఆచారవ్యవహారములను గుఱించియు, రాజ్యాంగ పద్దతులను గుఱించియు విషయమును సేకరించి లిఖంఛియుంచి భారతవర్ష ప్రాచీన చరిత్రాంశములఁ బెక్కింటికి నాధారభూతుఁడైన ఈ మెగాస్తనీసు మనకు సంస్మరణీయుండు గాఁడే!